ప్రేమలేఖ చాలు...!

పెళ్లయ్యి ఏళ్లు గడుస్తోంటే... ఏటికేడు దంపతుల మధ్య అనుబంధం బలపడాలి. ఒకరికొకరు మరింతగా అర్థమవాలి. అలాకాకుండా నిరాసక్తత, నిర్లక్ష్యం, అభద్రత చొరబడ్డాయంటే... మిమ్మల్ని మీరు తరచి చూసుకోవాల్సిందే. మీ బంధానికి కొత్త ఉత్సాహాన్ని అందించాల్సిందే.

Published : 09 Dec 2022 00:51 IST

పెళ్లయ్యి ఏళ్లు గడుస్తోంటే... ఏటికేడు దంపతుల మధ్య అనుబంధం బలపడాలి. ఒకరికొకరు మరింతగా అర్థమవాలి. అలాకాకుండా నిరాసక్తత, నిర్లక్ష్యం, అభద్రత చొరబడ్డాయంటే... మిమ్మల్ని మీరు తరచి చూసుకోవాల్సిందే. మీ బంధానికి కొత్త ఉత్సాహాన్ని అందించాల్సిందే.

ప్పుడూ సంసారంలో ఉన్న ఇబ్బందులూ, బాధ్యతల గురించి చర్చలేనా? మీ గురించి మీరు మాట్లాడుకుని ఎన్నాళ్లయ్యిందో గమనించుకున్నారా? అయితే ఓ పని చేయండి. ఆ సమయం మీకు దొరకాలంటే ముందు మీ భాగస్వామికో ప్రేమలేఖ రాయండి. పెళ్లయ్యి ఇన్నేళ్లు గడిచాక ఇప్పుడివేంటి? అనుకోవద్దు. మీరు ఇప్పటి వరకూ చెప్పలేని భావాలూ... ఇప్పుడు చెప్పాలనుకుంటున్న విషయాలూ అన్నీ అందులో ప్రస్తావించొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే మనసులో ఉన్న మీ భావాలన్నీ అక్షరాల్లో పేర్చి అందించేయండి. అది వారికీ ఓ చక్కని భావన కలగజేస్తుంది. ఏం కోల్పోతున్నామో అర్థమవుతుంది. మీకోసం మీరు స్పేస్‌ను కేటాయించుకునేలా చేస్తుంది.

మీకోసం మీరు... సంసార ఒత్తిడిలో పడిపోయి... మీకోసం మీరు సమయం కేటాయించు కోవడం మానేసి ఉండొచ్చు. పెళ్లయిన కొత్తలో మిమ్మల్ని మీరు ఎంత అందంగా చూసుకునే వారో ఇప్పుడూ ఆ ప్రయత్నం చేయండి. చర్మ, కేశ సంరక్షణపై దృష్టిపెట్టండి. మీ భాగస్వామి పైనా శ్రద్ధ చూపించండి. ఇవన్నీ ఒకరిపై మరొకరికి ఆసక్తిని పెంచుతాయి.

అర్థం చేసుకోండి...  బాధ్యతలూ, పనులతో తలమునకలవుతున్న భాగస్వామికి మీ ఓదార్పు కొండంత అండ అవుతుంది. అభద్రతను దూరం చేసి మిమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది. ఎదుటివారి పని తీరునీ, విధానాన్నీ అర్థం చేసుకోండి. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి సాంత్వననిచ్చే మాటలు మాట్లాడండి. వారి కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వండి. అప్పుడే మీ బంధం సంతోషంగా సాగిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్