కొడితే మొండికేస్తారు...

పిల్లల అల్లరిని నియంత్రించలేక కొట్టడం తిట్టడం చేస్తారు కొందరు తల్లిదండ్రులు. లేదంటే దేన్నో ఒకదాన్ని బూచిగా చూపిస్తుంటారు. ఇలాంటి పద్ధతులతో మార్పు రాకపోగా మొండిగా తయారయ్యే ప్రమాదం ఉందంటున్నారు పిల్లల నిపుణులు. అలాకాకూదంటే...

Updated : 13 Dec 2022 04:22 IST

పిల్లల అల్లరిని నియంత్రించలేక కొట్టడం తిట్టడం చేస్తారు కొందరు తల్లిదండ్రులు. లేదంటే దేన్నో ఒకదాన్ని బూచిగా చూపిస్తుంటారు. ఇలాంటి పద్ధతులతో మార్పు రాకపోగా మొండిగా తయారయ్యే ప్రమాదం ఉందంటున్నారు పిల్లల నిపుణులు. అలాకాకూదంటే...

ఎదుగుతోన్న పిల్లలు...అన్నీ తెలుసుకోవాలనుకుంటారు. గారంగా అడిగినప్పుడు ఇవ్వలేదని ఊరుకోరు. ఏడుపుతోనో, బెదిరింపులతోనో... బొమ్మలనో, వస్తువులనో సాధించాలనుకుంటారు. ఈ తీరు కొనసాగితే ఇతరుల దగ్గరా ఇలానే ప్రవర్తిస్తారు. అలాకాకూడదంటే... వారు పేచీ పెట్టినప్పుడు మనసు మళ్లించడానికి ప్రయత్నించండి. అయినా తగ్గకపోతే ఓపికతో నచ్చ చెప్పండి. లేదంటే... ఫలానా పని చేస్తేనే ఇస్తా అంటూ... లక్ష్యాన్ని నిర్దేశించండి. అది పూర్తి చేసే వరకూ కాస్త కఠినంగానే ఉండండి. క్రమంగా వారిలో మార్పు కనిపిస్తుంది.

చిన్నారులపై మీ అభిప్రాయాల్నీ, ఇష్టాయిష్టాల్నీ బలవంతంగా రుద్దొద్దు. స్వేచ్ఛగా అభిప్రాయాల్ని చెప్పే అవకాశం కల్పించండి. మనసులో ఉన్న బాధ, కోపాన్ని ఏదోరకంగా చెప్పగలిగే పిల్లల్లో మొండితనం, కోపం తక్కువగా ఉంటాయంటున్నాయి పరిశోధనలు.

ఎప్పుడైనా పిల్లలు మొండికేస్తుంటే బలవంతంగా వారిని దారిలోకి తెచ్చుకోవాలని చూడకండి. ప్రేను పంచుతూనే వారి సమస్యను అర్థం చేసుకోండి. మీ ఇంట్లో ఎవరైనా తనలానే ప్రవర్తించే వారుంటే ముందు వారిలో మార్పు రావాలి. వారిని చూసి... చిన్నారులూ అనుసరిస్తారు.

పిల్లల్లో భావోద్వేగాల నియంత్రణతో పాటూ... కష్టసుఖాలు అర్థం చేసుకునే తీరునీ చిన్నప్పుడే అలవాటు చేయాలి. ఇందుకోసం తమ పనులు తామే చేసుకోవడం అలవాటయ్యేలా చూడండి. తోటివారితో పంచుకోవడం, స్థాయి భేదాలు లేకుండా కలిసిపోవడం వంటివన్నీ తెలియాలి. అప్పుడే... మొండితనం పోయి తోటి వారితో ఎలా మెలగాలో తెలుస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్