భూతద్దంలో చూడొద్దు...

మయూరి ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూస్తుంది. తేలికగా తీసుకోవాల్సిన విషయాల గురించి కూడా గంటలతరబడి ఆలోచిస్తుంది.  ఇలాంటి తీరు దీర్ఘకాలం కొనసాగితే మానసిక ఆందోళనలకు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

Published : 25 Jan 2023 00:20 IST

మయూరి ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూస్తుంది. తేలికగా తీసుకోవాల్సిన విషయాల గురించి కూడా గంటలతరబడి ఆలోచిస్తుంది.  ఇలాంటి తీరు దీర్ఘకాలం కొనసాగితే మానసిక ఆందోళనలకు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

రిష్కారముంది కదా.. జీవితం అంటేనే కష్టసుఖాల సమ్మేళనం. వాటిని సమన్వయం చేసుకోగలిగితేనే సంసారం సాఫీగా సాగుతుంది. భాగస్వామితో వచ్చే చిన్నచిన్న తగాదాలూ, అవతలివారు సరదాగా అన్న మాటలూ, పిల్లల ప్రవర్తన... ఏదైనా కావొచ్చు. తేలిగ్గా తీసుకోవాల్సిన చిన్న విషయాలూ పెద్ద సమస్యగా పరిణమిస్తాయి. ఇబ్బంది ఏదైనా పరిష్కరించుకోవడానికి బోలెడు మార్గాలు ఉన్నాయన్న విషయం మనసులో నాటుకుంటే...తేలిక పడతారు.

సానుకూలంగా... జరగబోయే విషయాలు ప్రతికూలంగానే ఉంటాయని ఎందుకు అనుకోవాలి? వాటిని పక్కనపెట్టి సానుకూలంగా ఆలోచించడం నేర్చుకోవాలి. అయినా, ఆపదలూ, సమస్యలూ ఎప్పుడూ చెప్పిరావు. అన్ని వేళలూ మనకి అనుకూలంగా ఉండవు. వాటిని చూసి బెదిరిపోవద్దు. ప్రయత్నించి చూస్తేనే ఫలితం అని గుర్తించి ముందడుగు వేయండి.

కంగారు పడితే...    సమస్య నుంచి అస్సలు గట్టెక్కలేరు. అయినా ప్రయత్నించకుండానే భయమెందుకు? ముందు శాంతంగా ఆలోచించండి. ప్రతికూల అంశాలను మనసుకి తీసుకోకుండానే...వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. కచ్చితంగా ఒత్తిడిని జయిస్తారు. తీవ్ర ఆలోచనలకు దూరంగా ఉండగలుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్