పిల్లలతో అలా వద్దు!

మాధురి కూతురు ఎవరితోనూ కలవదు. ఏదో కోల్పోయినట్లుగా ఒంటరిగా ఉంటుంది. నిత్యం మాటలతో బాధించే మాధురిలాంటి టాక్సిక్‌ మామ్స్‌ వల్ల వారి పిల్లలెంతోమంది ప్రభావితమవుతున్నారంటున్నారు నిపుణులు.

Updated : 07 Feb 2023 05:17 IST

మాధురి కూతురు ఎవరితోనూ కలవదు. ఏదో కోల్పోయినట్లుగా ఒంటరిగా ఉంటుంది. నిత్యం మాటలతో బాధించే మాధురిలాంటి టాక్సిక్‌ మామ్స్‌ వల్ల వారి పిల్లలెంతోమంది ప్రభావితమవుతున్నారంటున్నారు నిపుణులు.  ఇది వారి భవిష్యత్తును  చీకటి చేస్తుందని హెచ్చరిస్తున్నారు.

ల్లంతా ప్రతికూల వాతావరణంతో నింపేసే టాక్సిక్‌ మామ్స్‌ పిల్లలతో కరకుగా ఉంటారు. భర్తపై కోపం లేదా.. అలా ఉంటేనే అందరూ తమ మాట వింటారని అలా ప్రవర్తిస్తుంటారు. చదువులో వెనుకబడినా..లేదా ఇతర పిల్లలు ర్యాంకులు సాధించినా వారు భరించలేరు. తమ పిల్లలు మార్కులు సాధించకపోవడం పెద్దవాళ్లకు నచ్చదు. ఎదుటివారితో పోలుస్తూ.. ప్రతి క్షణం అదే అంశాన్ని లేవనెత్తుతారు. తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ.. మీకోసమే ఇంత కష్టపడుతున్నామంటారు. తల్లిదండ్రుల ఆశయాలు, లక్ష్యాలు పిల్లలకు స్ఫూర్తిగా మారాలి తప్ప, వేధించేలా ఉండకూడదు.

కోపంగా.. భర్తతో విభేదాలు, వివాదాలు, అనుమానం వంటివి పిల్లల పట్ల కోపంగా మారి, అది టాక్సిక్‌ ప్రవర్తన అవుతుంది. ఇంటి పనంతా చేసుకోలేని అశక్తత, చేయూత లేకపోవడం, అనారోగ్యాలు, ఆందోళన, ఒత్తిడి వంటివీ కారణమవుతాయి. పిల్లలను కారణంలేకుండా దండిస్తుంటారు. పెద్దవాళ్లను చూస్తేనే భయపడే పిల్లలు ఇంట్లో ప్రేమ రాహిత్యానికి గురవుతారు.

మంచి వ్యక్తులుగా.. పిల్లలు ఆత్మవిశ్వాసానికి దూరమవుతారు. ఏదీ సాధించలేమనే వేదన వారిని ఆత్మన్యూనతకు గురిచేస్తుంది. ఇటువంటివారు పోటీపరీక్షల్లో ఒక్కమార్కు తగ్గినా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతూ ఉంటారు. మంచి మార్కులు లేదా ర్యాంకులు తెచ్చుకున్న వారిపై ద్వేషం పెంచుకొంటారు. ఎవరినీ ప్రేమించరు. కొన్ని సందర్భాల్లో సమాజమంటేనే భరించలేని స్థాయికి చేరుకుంటారు. అనారోగ్యకరమైన పోటీ తత్వాన్ని అలవరుచుకుంటారు. ఇలాకాకుండా ఉండాలంటే పిల్లలతో మృదువుగా మాట్లాడి వైఫల్యాల్లోనూ ధైర్యం చెప్పాలి. వారికి మంచి భవిష్యత్తు అందించడంకన్నా ముందు మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు మరవకూడదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్