Published : 16/03/2023 00:28 IST

చిన్నారికి ఇవి నేర్పుతున్నారా?

దువంటే సాధారణంగా నాలుగు గోడల మధ్య టీచర్లు పిల్లలతో వల్లెవేయించేదే అనుకుంటే  పొరబడినట్లే. అసలైన చదువు మన ఇంటి నుంచే మొదలవుతుంది. పసి వయసు నుంచే పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తూ ఉంటారు. ఉదాహరణకు తల్లి శిశువుతో చేసే సంభాషణలు, చూపించే రంగులు, భిన్న శబ్దాలు ఇవన్నీ వారిలో కాగ్నిటివ్‌ నైపుణ్యాలు పెరగటానికి దోహదపడతాయి. బాల్యంలో తల్లిదండ్రుల నుంచి నేర్చుకునే ఈ నైపుణ్యాలు పిల్లలు నలుగురితో కలవడం, భావోద్వేగాలను అదుపులో ఉంచుకునే శక్తిని అందిస్తాయి. ఇవి పెద్దయిన తర్వాత వారు తీసుకునే నిర్ణయాలు, తద్వారా వారి భవిష్యత్‌ మీద సానుకూల ప్రభావం చూపుతాయి.

ఆటపాటల్లో.. పజిల్స్‌ చేయటం, ఆటపాటల్లో వాళ్లతో పాల్గొనడం ద్వారా పిల్లలకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య అనుబంధం బలపడుతుంది. వారిలో నైపుణ్యాలు, సమస్యల్ని పరిష్కరించే తెలివితేటలూ అలవడతాయి.

విమర్శలొద్దు.. పదే పదే విమర్శించడం వల్ల పిల్లల్లో ఆత్మన్యూనత పెరుగుతుంది. బదులుగా సమస్యను కలిసి పరిష్కరించుకోవడం ఉత్తమం. పిల్లలు సాధించిన ఏ చిన్న విజయాన్నైనా అభినందించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని