పిల్లల బెంగ తీర్చేద్దామా!

పెద్దలకే కాదు... పిల్లలకీ బోలెడు ఆందోళనలు ఉంటాయంటారు నిపుణులు. అవును నాన్న ఊరెళ్లారనో, స్నేహితులతో కలవలేకపోతున్నాననో, తమ్ముడికంటే వెనకబడుతున్నానో.. ఇలా కారణం ఏదయినా కావొచ్చు.

Published : 27 Mar 2023 00:04 IST

పెద్దలకే కాదు... పిల్లలకీ బోలెడు ఆందోళనలు ఉంటాయంటారు నిపుణులు. అవును నాన్న ఊరెళ్లారనో, స్నేహితులతో కలవలేకపోతున్నాననో, తమ్ముడికంటే వెనకబడుతున్నానో.. ఇలా కారణం ఏదయినా కావొచ్చు. దీనివల్ల వారికి తెలియకుండానే ఒత్తిడికి లోనవుతారు. వారిలో భావోద్వేగాలు గమనించినప్పుడు... ఆ బెంగ తీర్చే బాధ్యత తల్లిదండ్రులదే. అదెలాగంటారా?

పిల్లల్లో ఒత్తిడి గమనించినప్పుడు... నాలుగ్గోడలకే పరిమితం చేయకండి. ముఖ్యంగా వారిని దగ్గర్లోని చెరువుగట్టుకో, పచ్చని పార్కుకో తీసుకెళ్లండి. కాసేపు ఆ పరిసరాల్ని ఆస్వాదించనివ్వండి. ఆ ఆహ్లాదకరమైన ప్రదేశంలో కాసేపు ఆటలాడండి. వాటర్‌ బబుల్స్‌ని ఊదించండి. మనసు తేలికపడుతుంది. క్రమంగా ఆ ఆలోచనల నుంచి బయటపడగలుగుతారు.

*  పిల్లలు చిన్న విషయానికే చిర్రుబుర్రులాడుతుంటే... మీరు చికాకు పడకండి. కొబ్బరి నూనెను వేడిచేసి ఒంటికి పట్టించి కాసేపు మర్దన చేయండి. ఆపై నలుగుపెట్టి స్నానం చేయించండి. చివరగా స్నానం చేసే నీళ్లల్లో రెండు చుక్కల గులాబీ ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలిపి వారినే పోసుకుని రమ్మనండి. మనసుతో పాటు శరీరమూ ఉల్లాసంగా మారుతుంది. కంటినిండా నిద్ర పట్టి ఒత్తిడి తగ్గుతుంది.

* ఆత్మీయులెవరైనా మనసు విప్పి మాట్లాడితే చాలు.. ఎంతటి బాధ అయినా ఉఫ్‌మని పోతుంది. మీ బిడ్డలతో అలా మాట్లాడి ఎన్నాళ్లయ్యిందో గుర్తుందా? హాయిగా ఓ గంట వాళ్లతో గడపండి. దగ్గరకు తీసుకుని హత్తుకోండి. కబుర్లు చెప్పండి. వాళ్లు చెప్పేది ఆసక్తిగా వినండి. అప్పుడే వారి ఆలోచనల్ని అర్థం చేసుకోవచ్చు. భయాలకు చెక్‌ పెట్టి... భరోసా ఇవ్వొచ్చు. తద్వారా అభద్రతకు దూరంగా, ఆనందంగా ఉంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్