అంత చనువు అక్కర్లేదు..!

అందరెదుట తనపై జోక్స్‌ వేసే 14 ఏళ్ల కూతురిని చూస్తే మర్యాద తగ్గినట్లు అనిపించి కవితకు కోపం వస్తుంది. ఎందుకలా చేస్తున్నావంటే ‘నువ్వు నా ఫ్రెండ్‌వి కదా’ అంటుంది. పెంపకంలో తల్లిదండ్రులు పిల్లలకి ఎంతవరకూ చనువునివ్వాలి? తెలుసుకుందాం.. 

Published : 31 Mar 2023 00:15 IST

అందరెదుట తనపై జోక్స్‌ వేసే 14 ఏళ్ల కూతురిని చూస్తే మర్యాద తగ్గినట్లు అనిపించి కవితకు కోపం వస్తుంది. ఎందుకలా చేస్తున్నావంటే ‘నువ్వు నా ఫ్రెండ్‌వి కదా’ అంటుంది. పెంపకంలో తల్లిదండ్రులు పిల్లలకి ఎంతవరకూ చనువునివ్వాలి? తెలుసుకుందాం.. 

పిల్లలు యుక్తవయసుకి వచ్చేసరికి వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలంటే స్నేహపూర్వకంగా చెప్పొచ్చు. అలాకాకుండా పూర్తిగా స్నేహితులుగా మారితే మాత్రం పెద్దవాళ్ల మాటలను వారు సీరియస్‌గా తీసుకోరు. స్నేహితురాలు చెబుతున్నట్లుగా భావించడానికి అవకాశం ఉంది. దాంతో తమకు నచ్చని అంశాన్ని అమ్మానాన్నలు చెప్పాలని చూసినా దాన్ని స్వీకరించడానికి వ్యతిరేకిస్తారు. అలాగే స్నేహితులవల్ల సంతోషం మాత్రమే కాదు, ఒత్తిడి, పోటీ వంటివాటితో పిల్లలు బయట ప్రభావితమవుతుంటారు. అటువంటివారికి ఇంట్లో తల్లిదండ్రులు మరొక స్నేహితులుగా కాకుండా, తల్లిదండ్రుల స్థానంలోనే ఉంటూ.. స్నేహపూర్వకంగా మెలుగుతూ సమయానుసారంగా వ్యవహరించాలి.

మృదువుగా..

కౌమారంలోకి అడుగుపెడుతున్న పిల్లలకు తల్లిదండ్రుల అవసరమే ఎక్కువ. హార్మోన్ల అసమతుల్యత, స్నేహితుల ప్రభావం, చదువులో పోటీ వంటివి ఆందోళనకు గురిచేస్తుంటాయి. ఆ సమయంలో తల్లిదండ్రులు చెబుతుంటే వినాలనే ఆసక్తి వారికి ఉండకపోవచ్చు. అలాగే ఇటు స్నేహితుల్లా మెలుగుతూ పరిష్కారం చెప్పినా వారి చెవికెక్కదు. ఆ పరిస్థితిని గుర్తించి సమయానికి సూచనలిస్తున్నట్లుగా కాకుండా, అలాగే మరొక స్నేహితుడిగానూ మారకుండా అమ్మ స్థానంలోనే ఉండి, స్నేహపూర్వకంగా మెలగాలి. ఒత్తిడి నుంచి పిల్లలను బయటకు తేవడానికి పెద్దవాళ్ల పర్యవేక్షణ తప్పనిసరి. అయితే అది గొంతుపెంచికాకుండా మృదువుగా చెప్పాలి. 

బలమైన బంధం..

పిల్లలతో అనుబంధం పెరుగుతుందని  తల్లిదండ్రులు వారు చెప్పినదే వినడం కూడా సరైనది కాదంటున్నారు నిపుణులు. బంధం బలంగా ఉండటానికి బాల్యం నుంచి వారిని ప్రేమించడం, సంరక్షించడం మాత్రమే కాదు, మంచి అలవాట్లు, క్రమశిక్షణ వంటివి నేర్పాలి. పిల్లలకొచ్చే ప్రతి సమస్యను గుర్తించి చేయూతనందించాలి. అమ్మానాన్నలున్నారనే భరోసా పిల్లలకు కలిగేలా చేయగలిగితే చాలు. అనుబంధం దానికదే గట్టిపడుతుంది. యుక్తవయసులోకి అడుగుపెడుతున్నప్పుడు ఈ బంధం వారికి మార్గనిర్దేశం చేయడానికి తోడ్పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్