సమస్యగా మారకండి..
పిల్లలు పరీక్షల సమయంలో భయపడుతూ నిద్రాహారాలు కూడా మర్చిపోతారు. వాళ్లు ముందే ఆందోళనకు గురవుతుంటే మనం వారి మీద ఒత్తిడి పెంచకూడదు. దీనివల్ల ప్రయోజనం ఉండకపోగా తెలిసింది కూడా మర్చిపోతారంటున్నారు నిపుణులు.
పిల్లలు పరీక్షల సమయంలో భయపడుతూ నిద్రాహారాలు కూడా మర్చిపోతారు. వాళ్లు ముందే ఆందోళనకు గురవుతుంటే మనం వారి మీద ఒత్తిడి పెంచకూడదు. దీనివల్ల ప్రయోజనం ఉండకపోగా తెలిసింది కూడా మర్చిపోతారంటున్నారు నిపుణులు.
* పరీక్షలు దగ్గరపడ్డాక చదవండి చదవండి.. అని పదే పదే చెబుతోంటే అది వారికి ఒత్తిడే తప్ప ఒరిగేదేం ఉండదు. బదులుగా వాళ్ల భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేయండి. మరచిపోతామని భయపడుతోంటే గుర్తుండే మార్గాలను సూచించండి. సాయంగా మీరూ కూర్చుంటే అదో ధైర్యం కూడా!
* ఇంతకు ముందు పరీక్షలు రాసిన ప్రశ్నపత్రాలన్నింటినీ ఓసారి తిరగేయమని చెప్పండి. సాధన కోసం వాటిని ఉపయోగించటం వల్ల ప్రశ్నపత్రం ఎలా ఉంటుందో అనే భయం కొంత వరకూ తగ్గుతుంది. స్నేహితులతో కూర్చొని చదువుకునేందుకు కొంత సమయం కేటాయించండి. అప్పుడు ఒకరికొచ్చిన సందేహాలు ఇంకొకరు తీర్చుకోగలుగుతారు.
* అదే పనిగా గంటలు గంటలు కూర్చోబెట్టి చదివించకండి. ఆ చిరాకులో ఏం చదివినా గుర్తు ఉండదు. మధ్యలో చిన్న విరామాలు తీసుకునేలా చూడండి.
* పరీక్షకు ముందు రోజు రాత్రి పిల్లలు నిద్ర మానేసి చదువుతుంటారు. నిద్రకు ప్రాధాన్యమివ్వండి. ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు బాగా చదవగలరని గుర్తుంచుకోండి. తరగతిలో మంచి మార్కులు వస్తే బహుమతులు ఇస్తానని ప్రోత్సహించడం, వెన్నుతట్టడం వంటివి చేస్తే ఉత్సాహంగా చదువుతారు. మొత్తంగా మీరు పక్కనుంటే ధైర్యంగా అనిపించాలే కానీ.. సమస్యగా తోచకుండా చూసుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.