సందేశాలతో సర్దుబాటు..

విషయం ఏదైనా భార్యభర్తల మధ్య వాదన మాత్రం సహజం. గొడవ సద్దుమణిగాకే ముందు మాట్లాడటానికి ఇగోలు అడ్డొస్తాయి. అలా ఇద్దరూ అవతలి వ్యక్తి మాట్లాడతారని ఎదురు చూస్తూ కుర్చుంటే ఎలా?

Published : 06 Apr 2023 00:19 IST

విషయం ఏదైనా భార్యభర్తల మధ్య వాదన మాత్రం సహజం. గొడవ సద్దుమణిగాకే ముందు మాట్లాడటానికి ఇగోలు అడ్డొస్తాయి. అలా ఇద్దరూ అవతలి వ్యక్తి మాట్లాడతారని ఎదురు చూస్తూ కుర్చుంటే ఎలా?

* వాదన అయిన వెంటనే బుజ్జగించుకోవడానికి దంపతులిద్దరూ బెట్టు చూపిస్తారు. అలాంటప్పుడు ఫోనులో ఒక సందేశం పంపండి. నేరుగా కాకుండా ఇలా ఫోనులోనే బుజ్జగించుకోండి. ఇద్దరి మనసులూ తేలికపడతాయి.

* మనవల్ల అవతలి వ్యక్తి ఇబ్బందికి గురైనప్పుడు చిన్న బహుమతిని ఇవ్వండి. బహుమతి అంటే చాలా ఖర్చు పెట్టి హడావిడి చేయనవసరం లేదు. వారి మనసుకు హత్తుకునేలా ఉండేవి చిన్నవైనా పర్లేదు. దానికి ఒక కార్డును జత చేసి సందేశం రాయండి. మీరెంత ప్రేమిస్తున్నారో తెలియజేయండి.

* మీరు మాట్లా డాలనుకున్న విషయాలన్నీ ఓ లేఖ రాస్తే సరి. అది మీ భావోద్వేగాల స్పర్శ తెలిసేలా ఉండాలి. అది చదవగానే భాగస్వామి ఎంత కోపమున్నా వెంటనే శాంతిస్తారు

* బంధం బలపడాలంటే ఎప్పుడూ ఒకవైపు నుంచే స్పందన కోసం ఎదురుచూడకండి. ఎవరికి నచ్చిన సమయంలో వారు స్పందిస్తే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్