పరిపక్వతతో మెలిగితేనే

కారణాలు ఏమైనా గతంలో తాము ప్రేమించిన వ్యక్తులే జీవిత భాగస్వాములు కాకపోవచ్చు. అటువంటప్పుడు గతాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే ప్రస్తుత జీవితం బాధాకరమవుతుందే తప్ప ప్రయోజనం ఉండదు.

Published : 21 Apr 2023 01:09 IST

కారణాలు ఏమైనా గతంలో తాము ప్రేమించిన వ్యక్తులే జీవిత భాగస్వాములు కాకపోవచ్చు. అటువంటప్పుడు గతాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే ప్రస్తుత జీవితం బాధాకరమవుతుందే తప్ప ప్రయోజనం ఉండదు. కానీ మానసిక పరిపక్వత ఉన్న భార్యాభర్తలు ఇలా ఆలోచిస్తారట..


మనసువిప్పి మాట్లాడుకోవటం.. నిజాయతీగా మనసువిప్పి మాట్లాడుకుంటేనే ఒకరిపై మరొకరికి నమ్మకం ఏర్పడుతుంది. అందుకే ఇలాంటి జంటలు ఎటువంటి అరమరికలు, దాపరికాలు లేకుండా మనసులోని భావాలను వ్యక్తపరచడమే కాదు ఎదుటివారు చెప్పేదీ వింటారు. భాగస్వామి బాధపడుతున్నప్పుడు అండగా ఉంటారు. భావోద్వేగాలను అర్థం చేసుకుంటారు. గతం తాలూకు సమస్యలు ప్రస్తుత బంధంలోకి రానివ్వరు.


క్షమించడం.. పరిపక్వత ఉన్న జంట ఒకరినొకరు క్షమించుకుంటారు. కక్షలు పెంచుకోవటం, గతాన్ని తవ్వుకోవటం వంటివి చేయరు. ప్రస్తుత బంధానికి విలువిచ్చి సంతోషంగా ముందుకు సాగాలని ప్రయత్నిస్తారు.


హద్దుల్లో ఉంటూనే... వారి అవసరాలు, అంచనాల గురించి నిజాయతీగా ఒకరికొకరు చెప్పుకొంటారు. పరస్పర అంగీకారంతో హద్దులు ఏర్పరచుకుని ఎదుటివారు అవి దాటు తున్నారనుకున్నప్పుడు నిర్మొ హమాటంగానూ తెలియజేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్