సిసింద్రీలే బాల మేధావులు

ఏ కూరగాయలతోనైనా నోరూరించే వంటలు చేయొచ్చు- పాకశాస్త్ర ప్రావీణ్యం తెలిసుంటే. ఎలాంటి మట్టి, వాతావరణం ఉన్నా.. వాటికి తగ్గ మొక్కలు నాటి అద్భుతాలు చేయొచ్చు- శ్రద్ధాసక్తులుంటే.

Published : 22 May 2023 00:14 IST

ఏ కూరగాయలతోనైనా నోరూరించే వంటలు చేయొచ్చు- పాకశాస్త్ర ప్రావీణ్యం తెలిసుంటే. ఎలాంటి మట్టి, వాతావరణం ఉన్నా.. వాటికి తగ్గ మొక్కలు నాటి అద్భుతాలు చేయొచ్చు- శ్రద్ధాసక్తులుంటే. మరి ఒకరిద్దరు పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దలేమా?! ఆ పని దిగ్విజయంగా చేయొచ్చు. ఈ వేసవిలో మన చిట్టి సిసింద్రీలని బాలమేధావుల్లా తయారుచేద్దామా..

* పిల్లల మనసులో ఉండే ఇష్టాలూ, అయిష్టాలూ, ఆసక్తులూ, అభిరుచులూ తెలుసుకోవడానికి వేసవి మంచి సమయం. వాళ్ల ఆలోచనలు మంచివైతే ప్రోత్సహించి వాటిల్లో వృద్ధి సాధించేలా ప్రోద్బలం ఇవ్వండి. ఏవైనా తప్పు అభిప్రాయాలూ, లోపాలూ గమనిస్తే కోపతాపాలు చూపకుండా అవి ఎందుకు మంచివి కావో విడమరిచి చెప్పండి.

* సైక్లింగ్‌ ఎంత మంచి వ్యాయామమో చెప్పి, ఉదయం ఎండ రాకముందు, సాయంత్రం చల్లబడ్డాక సైకిల్‌ తొక్కమనండి. డీజిలూ, పెట్రోలూ లేని సైకిల్‌తో ఖర్చు తగ్గడమేగాక వాతావరణ కాలుష్యం ఉండదని, చిన్న దూరాలకు అదే మంచిదని చెప్పండి. మీరు చెప్పే కథల్లో బైకులూ, కార్లకు బదులు సైకిల్‌నే ప్రస్తావించండి. పక్కింటి పిల్లలతో సైకిల్‌ పోటీ పెట్టి, కింద పడకుండా, వేగంగా గమ్యం చేరడమే లక్ష్యమని చెప్పండి. నెగ్గినవారికి బహుమతులు ఇవ్వండి.

* మీ దగ్గర్లో ఉన్న పంచదార ఫ్యాక్టరీ, వస్త్ర కర్మాగారం లాంటివి పరిచయం చేయండి. ఆయా వస్తువులూ పదార్థాల తయారీ గురించి అవగాహన కలిగించడంతోబాటు ఎందరు పనివాళ్లు ఎంతగా శ్రమిస్తున్నారో చెప్పండి. వాళ్ల పట్ల గౌరవభావం ఏర్పడుతుంది.

* ఏదైనా కళలో నైపుణ్యం ప్రదర్శించమనండి. అందులో నిష్ణాతులవ్వాలంటే ఎంత పట్టుదల ఉండాలో, ఎలా కృషిచేయాలో చెప్పండి. ప్రోత్సాహకాలుగా ఇష్టమైన వస్తువు కొనివ్వండి, నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్లండి. ఒక పనిలో మెలకువలు తెలిస్తే సరిపోదని, మనకంటూ ప్రత్యేకత ఉండాలంటూ అవగాహన కలిగించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్