ఎలాంటి పుస్తకాలిస్తున్నారు...

చిన్నారుల్లో సృజనాత్మకత పెరగాలన్నా, మెదడుకు చురుకుగా పలురకాల అంశాలపై ఆలోచించగలిగే శక్తిని పెంచాలన్నా పుస్తకపఠనం తప్పనిసరి. ఈ అభిరుచిని పెంపొందించడంలో తల్లిదండ్రులు బాధ్యతవహించాలి. అలాగే బాల్యం నుంచి పిల్లలకు వయసుకు తగ్గట్లు పుస్తకాలను ఎంపిక చేసి అందిస్తే వారిలో పఠనంపై మరింత ఆసక్తి పెరుగుతుంది.

Updated : 27 Jun 2023 04:56 IST

చిన్నారుల్లో సృజనాత్మకత పెరగాలన్నా, మెదడుకు చురుకుగా పలురకాల అంశాలపై ఆలోచించగలిగే శక్తిని పెంచాలన్నా పుస్తకపఠనం తప్పనిసరి. ఈ అభిరుచిని పెంపొందించడంలో తల్లిదండ్రులు బాధ్యతవహించాలి. అలాగే బాల్యం నుంచి పిల్లలకు వయసుకు తగ్గట్లు పుస్తకాలను ఎంపిక చేసి అందిస్తే వారిలో పఠనంపై మరింత ఆసక్తి పెరుగుతుంది.

పిల్లలకు మూడేళ్లు నిండేసరికి రంగురంగుల బొమ్మలతో కథలను చెప్పే పుస్తకాలెక్కువగా ఆకర్షిస్తాయి. వాటిని అందించడమే కాకుండా దగ్గరుండి ఆ బొమ్మల గురించి వివరంగా తేలికగా అర్థమయ్యేలా పెద్దవాళ్లు విడమర్చి చెప్పాలి. జంతువులతో చెప్పే కథలే ఎక్కువగా వారికి ఆసక్తిని కలిగిస్తాయి. అలాకాకుండా పుస్తకాలు చేతికిచ్చి వాళ్లే చూస్తారులే అని వదిలేస్తే అర్థంకాక పక్కన పడేస్తారు. కథలు చెప్పడం కోసం వారికి కొంత సమయాన్ని కేటాయించాలి. పిల్లలు దానికోసం ఎదురు చూసేలా ఉండాలి. నాలుగో ఏట తర్వాత పిల్లల మెదడులో అద్భుతమైన కల్పన కలిగేలా పౌరాణిక కథలను ఎంపిక చేయాలి. ఆయా పాత్రల్లో చిన్నారులు లీనమయ్యేలా తల్లిదండ్రులు చదివి వినిపించాలి. ఈ వయసులో సునాయాసంగా అర్థమయ్యేవాటిపైనే పిల్లలు ఆసక్తి చూపిస్తారు.

అభిరుచికి తగ్గట్లు..  చిన్న వయసులోనే వారికి ఎటువంటి వాటిపై ఆసక్తి ఉందో గుర్తించొచ్చు. దాన్నిబట్టి కూడా పుస్తకాల ఎంపిక ఉండాలి. కొందరు పిల్లలు అడవులు, జంతువులంటే ఇష్టపడితే, కొందరు పదేళ్లు నిండకుండానే అంతరిక్షం, రాకెట్లు అంటూ కబుర్లు చెబుతుంటారు. మరికొందరు వాహనాలంటే అమితంగా ఆసక్తి చూపిస్తుంటారు. కొందరు పిల్లలు చిన్నప్పటి నుంచి ప్రపంచంలో జరిగేవన్నీ తెలుసుకోవాలనుకుంటారు. వీరి అభిరుచిని బట్టి దానికి సంబంధించిన పుస్తకాలను పరిచయం చేయాలి. వాటి గురించి మరింత సునాయాసంగా అవగాహన కలిగించడానికి ప్రయత్నించాలి. దాంతో వారి అభిరుచితోపాటు కెరియర్‌ను ఎంచుకోవడంలోనూ ముందుంటారు.

దయ.. పిల్లలందరికీ స్కూల్‌ స్థాయికొచ్చేసరికి సామాజిక సేవలందించేవారి స్ఫూర్తి కథనాలు, ప్రముఖుల జీవిత చరిత్రలను చదివేలా చేయాలి. ఆసక్తి కనబరచక పోయినా లేదా సమయం లేకపోయినా తల్లిదండ్రులు కనీసం కాసేపైనా వాటిని చదివి పిల్లలకు వినిపించడం మంచిది. అప్పుడే వారిలో ఎదుటివారిని ప్రేమించడం, పేదలపై దయ చూపడం, దానం వంటివన్నీ నేర్చుకుంటారు. జీవితానికో లక్ష్యం ఉండాలనే విషయాన్ని తెలుసుకుంటారు. అలాగే అమ్మాయిలకు యుక్తవయసుకు వచ్చేముందు నెలసరి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి విషయాలపై అవగాహన కలిగించే పుస్తకాలను అందించాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్