ఆ బాధకి విరామం ఇవ్వండి!

భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు సహజం. ఇలాంటప్పుడు కొన్నిసార్లు కోపం, బాధా, దుఃఖం, అసూయ... లాంటి ఉద్వేగాలు పైచేయి సాధించాలనుకుంటాయి.

Published : 09 Jul 2023 01:11 IST

భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు సహజం. ఇలాంటప్పుడు కొన్నిసార్లు కోపం, బాధా, దుఃఖం, అసూయ... లాంటి ఉద్వేగాలు పైచేయి సాధించాలనుకుంటాయి. ఇలాంటప్పుడు మాటలు తూటాల్లా మారతాయి. ఇవి మానసికంగానైనా సరే మనసుల్ని శాశ్వతంగా దూరం చేస్తాయి! అలా కాకూడదంటే..

  • ఎదుటివారిపై తీవ్రమైన కోపమొచ్చినప్పుడు మనకు తెలియకుండానే మాట విసిరేస్తాం. అదే పెద్ద రాద్ధాంతానికి కారణం అవుతుంది. అందుకే కోపం వచ్చినప్పుడు...వీలైనంతవరకూ ఓ పదినిమిషాలు స్పందించకుండా ఉండి చూడండి. కాస్త కష్టమే కానీ ప్రయత్నించాలని పట్టుదలగా అనుకుంటే మనసు మాట వినొచ్చు. విషయ తీవ్రతని బట్టి గంటా, ఓ పూటా, వీలైతే ఓ రోజంతా  స్పందించకుండా ఉండండి. సుదీర్ఘంగా నడవండి, ఏదైనా పుస్తకం చదవండి. అప్పటికీ మీలో ఆ బాధ ఉంటే అప్పుడు స్పందించండి.
  • ఏ విషయమైనా సరే భాగస్వామిని నొప్పించకుండా ఎలా చెప్పాలో ముందు ఆలోచించండి. ‘నన్నిలా బాధపెట్టారు కాబట్టి నేనూ అలా చేయాల్సిందే!’ అనే ధోరణి ఏ కోశానా వద్దు. మీతో కలకాలం కలిసి నడవాల్సిన ఏ బంధానికీ ఇటువంటి ప్రతీకారేచ్ఛ పనికిరాదు.
  • తప్పొప్పుల ప్రసక్తి వద్దు. మీరు ఎదుర్కొన్న సంఘటన మీ మనసుపై ఎలాంటి ప్రభావం చూపిందో అది మాత్రమే వ్యక్తం చేయండి. ఎప్పటెప్పటివో ముడిపెట్టుకోవడం వల్ల సమస్య మరింత పెరిగి పెద్దదవుతుంది.  ఏ పరిస్థితుల్లోనూ మీ బాధను దాచుకుంటూ మొహమాట పడాల్సిన అవసరమూ లేదు. ఇలా అసంతృప్తి పెరిగి పెద్దదై ఎప్పుడో ఒకప్పుడు అది ఇంతకంటే పెద్దగా పెల్లుబుకుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్