అప్పుడే అబద్ధాలా?

పిల్లలు కొన్నిసార్లు అబద్ధాలు ఆడటం సహజమే. అలాగని...వారిని కొట్టడం తిట్టడం చేస్తున్నారా? అస్సలు వద్దు. ఎందుకంటే... నిజానికి వారా పనిచేయడానికి మీరూ ఓ కారణం అంటారు మానసిక నిపుణులు.

Updated : 15 Jul 2023 05:29 IST

పిల్లలు కొన్నిసార్లు అబద్ధాలు ఆడటం సహజమే. అలాగని...వారిని కొట్టడం తిట్టడం చేస్తున్నారా? అస్సలు వద్దు. ఎందుకంటే... నిజానికి వారా పనిచేయడానికి మీరూ ఓ కారణం అంటారు మానసిక నిపుణులు. ఎందుకలా? ఈ ఇబ్బందినెలా అధిగమించాలి అంటారా?

  • చిన్నారి మీతో సులువుగా అబద్ధం చెబుతోందా? తరచూ చాలా విషయాలను దాచడానికి ప్రయత్నిస్తోందా? ఇందుకు మీరే కారణం కావొచ్చు.  తన ఓటమినో, తప్పుల్నో మీ దగ్గర చెబితే కోపగించుకుంటారనో, శిక్షిస్తారనే భయమో ఇందుకు మూలం. ఏం చెప్పినా సామరస్యంగా పరిష్కరించేద్దామనే భరోసా ఇవ్వండి. క్రమంగా ఈ అలవాటుని మార్చుకుంటారు.
  • ఎదిగే పిల్లలు సొంతంగా ఆలోచించాలనుకుంటారు. స్వేచ్ఛగా గడిపేయాలనుకుంటారు. అలాగని వారిని అతిగా నియంత్రించడం, చూసీ చూడనట్లు వదిలేయడం రెండూ తప్పే. వారికి ప్రేమను పంచుతూ మీ సాన్నిహిత్యాన్ని మరింతగా పెంచుకోగలిగితే అదుపు తప్పకుండా, అబద్ధాలు ఆడకుండా చేసుకోవచ్చు.
  • టీవీ అతిగా చూడటం, స్మార్ట్‌ఫోన్‌కి అతుక్కుపోవడం నిజంగా దురలవాట్లే. వాటి విషయంలో మీరు కొన్ని నియమాలు పెట్టాల్సిందే. కానీ ఆ నియమాలపై మరీ పంతంపట్టకండి. అతిక్రమశిక్షణ పేరుతో వాళ్లకిష్టమైనవాటిని దూరం చేయకండి. అలా చేస్తే.. వాళ్లు వాటిని చూడటానికి వేరే దార్లు వెతుక్కుంటారు. ఇంకేముంది? ఆ చిన్న వయసులో అనవసరమైన దాపరికాలు నేర్చుకోవడం మొదలుపెడతారు. అలాకాకుండా అవకాశం కల్పిస్తూనే హద్దులు పెట్టండి. చెప్పిన మాట విన్నప్పుడు అభినందించడం మంచిదే. ఇవన్నీ పారదర్శకంగా ఉంచుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్