మాట్లాడటానికి ఆలోచిస్తున్నారా?

భార్యాభర్తలు మధ్య చిన్నచిన్న గొడవలు, అపోహలు, వాదనలు సర్వసాధారణం. కానీ తుఫానులా అవి వచ్చి వెళ్లిపోయినా..  దాని తాలూకు బీభత్సం మాత్రం కొనసాగుతూనే ఉంది.

Updated : 21 Jul 2023 05:14 IST

భార్యాభర్తలు మధ్య చిన్నచిన్న గొడవలు, అపోహలు, వాదనలు సర్వసాధారణం. కానీ తుఫానులా అవి వచ్చి వెళ్లిపోయినా..  దాని తాలూకు బీభత్సం మాత్రం కొనసాగుతూనే ఉంది. అవతలి వాళ్ల మౌనం వేధిస్తునే ఉంటుంది. మాట్లాడాలన్నా ఈగోలు అడ్డం వస్తాయి. మరి ఈ పరిస్థితిని చక్కదిద్దుకోవడం ఎలానో తెలుసా?.. 

  ఏదో ఒక సందర్భంలో నాకు ఫలానా వస్తువు కొనుక్కోవాలని ఉందనో, నచ్చిందనో మీతో మీ భాగస్వామి ప్రస్తావించే ఉంటారు. అది తెచ్చి వాళ్లకు అందించండి. వాళ్ల అభిరుచిని గుర్తుంచుకుని, పట్టించుకున్నందుకు శాంతపడిపోతారు. 

వాళ్లకి ఇష్టమైన ఆహారాన్ని వండిపెట్టండి. దగ్గరుండి కొసరికొసరి వడ్డించండి. అంతా మరచిపోయి ముందులా సజావుగా సాగిపోతుంది జీవితం. మనసెరిగి నడుచుకోవడం అన్యోన్య దాంపత్యానికి తొలిమెట్టని గుర్తుంచుకోండి.

పర్యటనలు, పార్టీలు, విందులు ఎప్పుడూ మగవాళ్లే ప్రణాళికలు వేసి, మనల్ని సర్‌ప్రైజ్‌ చెయ్యాలా? కొంచెం కొత్తదనాన్ని ఫాలో అయి మనం ఒకసారి వాళ్లకు ఇష్టమైన ప్రాంతానికి గానీ, రెస్టరంట్లకు గానీ తీసుకువెళదాం. ఇవన్నీ చేస్తే వేరేగా క్షమాపణ చెప్పాలా.. అనుకోకండి. తప్పు మీదైతే ఒప్పుకోండి. కచ్చితంగా క్షమించేస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్