మూడుముళ్లు పడ్డాక.. ఇలా!

మధుమిత, లోకేష్‌ దంపతుల మధ్య చిన్న  భేదాభిప్రాయమొచ్చినా చాలు. రెండు మూడు వారాలు మాటలుండవు.  దాంపత్యంలో భాగస్వామి భావాలను గాయపరచనంత వరకు ఆ బంధం సంతోషంగా కొనసాగుతుందంటున్నారు నిపుణులు..

Published : 17 Sep 2023 01:38 IST

మధుమిత, లోకేష్‌ దంపతుల మధ్య చిన్న  భేదాభిప్రాయమొచ్చినా చాలు. రెండు మూడు వారాలు మాటలుండవు.  దాంపత్యంలో భాగస్వామి భావాలను గాయపరచనంత వరకు ఆ బంధం సంతోషంగా కొనసాగుతుందంటున్నారు నిపుణులు..

దాంపత్య బంధం ప్రేమ బంధంగా మారాలంటే మూడు ముళ్లు పడినప్పటి నుంచి ఆ ఇరువురూ పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. ఎదుటివారి భావాలు నచ్చనప్పుడు మాటలు లేదా చేతల ద్వారా కించపరచకూడదు. అవతలివారు దాన్ని అవమానంగా భావించే ప్రమాదం ఉంది. తమకు విలువనివ్వడం లేదనుకొని అపోహపడతారు. చిన్న సందర్భాన్ని కూడా వదలకుండా భాగస్వామి ఆలోచనలను తక్కువ చేయడానికి చూసేవారుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ అలవాటును పూర్తిగా తగ్గించుకోవడం మంచిది. ప్రతి ఒక్కరిలోనూ.. ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అవతలివారిలో దాన్ని గుర్తించడం నేర్చుకోగలగాలి. అప్పుడే ఎదుటివారిని విలువగా చూడటం అలవడుతుంది. ఇరువురి మధ్య మొదటి నుంచి సరైన అవగాహనతోపాటు మంచి సంభాషణ జరగాలి. నచ్చినవి, నచ్చనవి అంటూ విడదీయకుండా ముందుగా భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే వైవాహిక బంధం బలపడటానికి మార్గం సులువవుతుంది. 

కొత్తలో.. పెళ్లైన కొత్తలో ఎదుటివారిని పూర్తిగా పరిశీలించడం అలవరుచుకోవాలి. వారిపై అభిప్రాయాన్ని ఏర్పరుచుకోకూడదు. ఇరువురూ కలిసి మనసులు పంచుకోవాలి. అప్పుడే అవతలివారి బలాలు, బలహీనతలు తెలుస్తాయి. ఒకరి గురించి మరొకరు పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత ఇరువురూ తమ అభిప్రాయాలను చెప్పుకొన్నా.. అవతలివారు అర్థం చేసుకొనే అవకాశం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్