అతి సౌకర్యాలతో అధిక చింతలు

భార్యాభర్తలు ఉద్యోగం చేస్తూ పిల్లలకు తగినంత సమయాన్ని కేటాయించలేకపోతున్నామనే అపరాధ   భావం ఇప్పుడు ఎక్కువైపోతోంది.

Updated : 22 Sep 2023 12:23 IST

భార్యాభర్తలు ఉద్యోగం చేస్తూ పిల్లలకు తగినంత సమయాన్ని కేటాయించలేకపోతున్నామనే అపరాధ భావం ఇప్పుడు ఎక్కువైపోతోంది. దీనివల్ల వాళ్లకి సౌకర్యాల పేరుతో విలువలు తెలియకుండా పెంచుతున్నారు. పిల్లల్ని ముద్దు చేయడం మంచిదే గానీ, అతి గారాబం వల్ల అనేక చిక్కులు వస్తాయంటున్నారు నిపుణులు.

  •  పిల్లలకోసం సమయం కేటాయించలేకపోతున్నామన్న భావనతో  ఏది అడిగితే అది తెచ్చిపెడుతుంటాం. భాగస్వామి వద్దన్నా గొడవ పడి మరీ పిల్లలు అడిగింది ఇస్తుంటాం. ఇలా చేస్తే మీ బలహీనతను వారికి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. అందుకే వారి పెంపకం విషయంలో ఇద్దరూ  ఒక మాట మీదే ఉండండి.  
  • మంచి నడవడిక, విలువలు, గౌరవ మర్యాదలు పిల్లలకు ముందు నుంచే నేర్పాలి. అయిదారేళ్లు వచ్చిన్నప్పటి నుంచే వారికి ప్రతీదీ అలవాటు చేయాలి. అంతేకానీ ముందంతా ముద్దు చేసి ఒక్కసారిగా హద్దులు పెడుతుంటారు కొందరు. ఇది మంచిది కాదు, ఒక్కసారిగా మీ ప్రవర్తనలో వచ్చే మార్పును వాళ్లు సహించలేక, తప్పుడు నిర్ణయాలు తీసుకొనే ప్రమాదం ఉంది.
  • గాయపడతారని తోటి పిల్లలతో ఆడుకోవడానికి పంపకుండా ఉంటారు. ఇది వారిని నలుగురిలో కలవగలిగే నైపుణ్యాలను దూరం చేస్తుంది. పిల్లలెదుట ఇతర మతాల్ని, కులాల్ని, ఆర్థిక పరిస్థితుల్ని కించపరచకూడదు. ఇది వారి ఆలోచనా విధానాన్ని తప్పు మార్గంలో నడిపిస్తుంది. వారి మనసు బాల్యం నుంచి ఎంత స్వచ్ఛంగా ఉంటే పెద్దాయ్యాక వాళ్ల ఆలోచనలు అంత స్వేచ్ఛగా ఉంటాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్