అందరికీ మర్యాద.. అమ్మానాన్నలకి అమర్యాద!

సౌజన్య కొడుకు బయట స్నేహితులు, బంధువులతో ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తాడు. చేసిన పనులకు థాంక్యూ, సారీ చెబుతుంటాడు.

Published : 28 Nov 2023 02:16 IST

సౌజన్య కొడుకు బయట స్నేహితులు, బంధువులతో ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తాడు. చేసిన పనులకు థాంక్యూ, సారీ చెబుతుంటాడు. ఇంట్లో మాత్రం పెద్దవారి పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తాడు. కొందరు పిల్లలు ఎందుకిలా చేస్తారో కారణాలను, పరిష్కార మార్గాలనూ చెబుతున్నారు నిపుణులు.

  •  కొందరు పిల్లలు స్కూల్లో ఉపాధ్యాయుల నియమాలకు చక్కగా కట్టుబడి ఉంటారు. తమ ప్రవర్తనకు తోటి పిల్లలెలా స్పందిస్తారో తెలియక వారి వద్ద కూడా కుదురుగా నడుచుకుంటారు. కానీ, అమ్మానాన్నల దగ్గరకొచ్చేసరికి మాత్రం ప్రవర్తన మరోలా ఉంటుంది. ఎందుకంటే టీచర్‌ చెప్పే లక్షణాలు, నైతిక విలువలు వంటివి వీరివద్ద కనిపించకపోవడమే అసలు కారణం. దీంతో పెద్దల ప్రవర్తన కోపాన్ని తెప్పిస్తుంది. దాన్నెలా వ్యక్తీకరించాలో తెలియక వారికి వ్యతిరేకంగా ప్రవర్తించి తల్లిదండ్రులపట్ల తమ తిరస్కార భావాన్ని ప్రదర్శిస్తారు.  
  • ఇంట్లో పెద్దవాళ్లు క్రమశిక్షణను గుర్తుచేస్తే కొందరు చిన్నారులు చికాకు పడతారు. తప్పు చేసినా, ఇంట్లో ఎవరైనా సారీ, థ్యాంక్స్‌ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటారు.  వద్దన్నా, కాదన్నా... వ్యతిరేకిస్తుంటారు. ఈ ప్రవర్తనకు మొదటి కారణం మీ ఇంటి వాతావరణమేనని గుర్తించండి. ఇంట్లోనూ వారు పద్ధతిగా నడుచుకోవాలంటే వారెదుట తల్లిదండ్రులుగా మీ మధ్య సత్సంబంధాలు ఉండాలి. వారెదుటే అబద్ధాలు చెప్పడం, ఇతరులను కించపరిచి మాట్లాడటం వంటివి పిల్లలు గమనిస్తారు.
  • పిల్లలకు మొదటి గురువులు తల్లిదండ్రులే. అందుకే, వారిని మాటల్లో, చేతల్లో అనుసరిస్తారు. వారితో ఇంటా, బయటా ఒకేలా ప్రవర్తించాలని చెప్పి... దానికి భిన్నంగా మీరు మరోలా వ్యవహరిస్తుంటే అసహనానికి గురవుతారు. ముఖ్యంగా బంధువులు, స్నేహితులను కలిసినప్పుడు వారెదుట ప్రేమగా మాట్లాడి, వెనుక హేళన చేయడం, తక్కువగా మాట్లాడటం చేస్తుంటే మానేయండి. ఇవన్నీ వారికి మీపై గౌరవాన్ని తగ్గిస్తాయి.  వస్తువుల్ని తోబుట్టువులతో పంచుకోవడం, ఇంటి పనులు చేయడం బాల్యం నుంచే అలవరచాలి. తప్పు చేసినప్పుడు క్షమాపణ అడగడం, ఎదుటివారి నుంచి సాయం పొందినప్పుడు కృతజ్ఞతలు చెప్పడం వంటివాటివల్ల ఎలా ప్రయోజనం చేకూరుతుందో చెప్పండి. వారితో ఎక్కువ సమయాన్ని గడపడం, వారి ఆలోచనలను పంచుకోవడం, తగిన సలహాలివ్వడం ద్వారా జీవన నైపుణ్యాలెన్నో నేర్చుకుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్