ముందే మాట్లాడుకోండి!

భార్యాభర్తల మధ్య ఎంత ప్రేమైనా ఉండొచ్చు. కానీ కొన్ని హద్దులు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. అవే భవిష్యత్తులో మీరు ఇబ్బందుల బారిన పడకుండా చూస్తాయి.

Published : 03 Dec 2023 01:38 IST

భార్యాభర్తల మధ్య ఎంత ప్రేమైనా ఉండొచ్చు. కానీ కొన్ని హద్దులు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. అవే భవిష్యత్తులో మీరు ఇబ్బందుల బారిన పడకుండా చూస్తాయి..

  • పెళ్లి నిశ్చయం అవగానే అతనితో ప్రతి చిన్న విషయాన్నీ చర్చించడం మొదలు పెడుతున్నారా? ఈ తీరు సరి కాదు. అప్పటికి అవి సంతోషంగా అనిపించినా తర్వాత అవే సమస్యలుగా మారతాయి. మన ఇష్టాయిష్టాలను పంచుకోవడంలో తప్పు లేదు. కానీ మన గతం గురించి పూసగుచ్చినట్లు ప్రతిదీ చెబితే భవిష్యత్తులో వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తవచ్చు.
  • మీ బలహీనతలను అవతలి వారితో విపులంగా పంచుకోవడమూ మంచిది కాదు. భవిష్యత్తులో అవే వారికి ఆయుధాలుగా మారతాయి.
  • మనమధ్యలో డబ్బు ప్రస్తావన రాకూడదు లాంటి మాటలు పక్కనపెట్టి... ఆర్థికాంశాల గురించి తప్పనిసరిగా మాట్లాడుకోవాలి. జీతం.. ఖర్చులు వంటివి ముందుగానే ప్రణాళిక వేసుకుంటే మంచిది. ఇద్దరూ ఉద్యోగస్థులైతే ఇంటిపని పంచుకోవడం వంటివి చర్చించుకోవడం తప్పనిసరి. అవతలి వ్యక్తి వీటికి సానుకూలంగానే ఉన్నారా తెలుసుకోండి. లేదంటే పెళ్లి తర్వాత... చిన్న విషయాలు అనుకున్నవే పెద్దగా మారి ఇబ్బందులు తెచ్చిపెడతాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్