సరదాగా గడిపితే చాలు...

ఈ రోజుల్లో కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలతో కన్నా ఆఫీసుల్లోనూ, ఫోనుల్లోనే...ఎక్కువగా గడిపేస్తున్నారు. ఎంత తీరిక లేకున్నా వారికోసం రోజూ కొంత సమయం గడిపితేనే వారు మానసికంగా దృఢంగా ఉంటారంటారు మానసిక నిపుణులు. ఇంటిల్లిపాదీ పనులు, బాధ్యతల ఒత్తిడితో గడిపేస్తే ఎలా? ఉదయమో, రాత్రి నిద్రపోయే ముందో పిల్లలతో కలిసి కూర్చోండి.

Published : 04 Dec 2023 01:19 IST

ఈ రోజుల్లో కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలతో కన్నా ఆఫీసుల్లోనూ, ఫోనుల్లోనే...ఎక్కువగా గడిపేస్తున్నారు. ఎంత తీరిక లేకున్నా వారికోసం రోజూ కొంత సమయం గడిపితేనే వారు మానసికంగా దృఢంగా ఉంటారంటారు మానసిక నిపుణులు.

  • ఇంటిల్లిపాదీ పనులు, బాధ్యతల ఒత్తిడితో గడిపేస్తే ఎలా? ఉదయమో, రాత్రి నిద్రపోయే ముందో పిల్లలతో కలిసి కూర్చోండి. కథలు చెప్పడం, నవ్వించడం, స్కూల్‌ విషయాలు అడిగి తెలుసుకోవడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చిన్న చిన్న భయాలూ, ఆందోళనలూ దూరమవుతాయి.
  • కొందరికి...భిన్నమైన ఆఫీసు వేళలతో పిల్లల్ని కలిసే సమయం ఉండదు. ఇలాంటప్పుడు వారికోసం చిన్నచిన్న లేఖలు రాయండి. వారి భావాలను మీతో పంచుకునేందుకు ఒక బాక్సు ఏర్పాటు చేయండి. తమ అవసరాలను, మీతో పంచుకోవాలన్న ఆలోచనలనూ కాగితంపై రాసి అందులో వేయమనండి. వాటిని చూశాక మీరు స్పందించొచ్చు. మనసులోని విషయాలను పంచుకునేందుకు ఇదో చక్కని దారి. కచ్చితంగా ఈ మార్గం మీరెంత దూరంగా ఉన్నా బుజ్జాయిలకు దగ్గర చేస్తుంది.
  • పనుల హడావుడి వల్ల చిన్నారులతో కలిసి భోజనం చేసే సమయం దొరకట్లేదా! అయితే, ఉదయాన్నే లేచి వారితో కలిసి కాసేపు నడకకు వెళ్లండి. ఆ సమయంలో వారితో కలిసి కబుర్లు చెప్పొచ్చు. ఇలా సమయం గడపడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులేవైనా ఉంటే పంచుకుని పరిష్కరించుకుంటారు. ఒత్తిడీ దూరమవుతుంది. ప్రశాంత వాతావరణంలో ఇది సాగడం వల్ల మీరు చెప్పేది స్పష్టంగా అర్థం చేసుకోగలరు కూడా.
  • పిల్లలతో రోజు ప్రేమగా మాట్లాడటం వల్ల మీతో ఏ విషయాన్నైనా బయటకు చెప్పగలరు. మీతో సౌకర్యవంతంగా ఉండగలరు. వారికి స్కూల్‌, హోమ్‌ వర్క్‌ విషయంలో సాయం చేయడం వల్ల తమ చదువుల్లో రాణించగలరు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్