ఆరోగ్య దాంపత్యానికి మూడు సూత్రాలు...

ప్రేమపెళ్లి అయినా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా ఇద్దరి మధ్యా గొడవలు... వాటి వల్ల విడాకుల ప్రస్తావన వస్తుంటుంది. భార్యాభర్తల మధ్య ఈ సూత్రాలు పాటిస్తే జీవితం సంతోషంగా సాగుతుంది అంటున్నారు నిపుణులు.

Published : 15 Feb 2024 01:23 IST

ప్రేమపెళ్లి అయినా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా ఇద్దరి మధ్యా గొడవలు... వాటి వల్ల విడాకుల ప్రస్తావన వస్తుంటుంది. భార్యాభర్తల మధ్య ఈ సూత్రాలు పాటిస్తే జీవితం సంతోషంగా సాగుతుంది అంటున్నారు నిపుణులు.

  • చాలామంది భార్యాభర్తలు తమ భాగస్వామిని ఇతరుల ఎదుట నేను సంపాదిసున్నా కాబట్టి నేనే ఎక్కువ.. లేదు వండి పెడుతున్నా నేను ఎక్కువ అంటూ ఒకరిని మరొకరు నిందించుకోవడం వల్ల ఇద్దరి మధ్యా తగాదాలకు తోవ మొదలవుతుంది. అలాకాకుండా ఇరువురూ ఒకరినొకరు గౌరవించుకుంటూ అన్నింటిలోనూ పాలుపంచుకుంటూ ఎక్కువతక్కువ తేడాలు లేకుండా ఉండడం వల్ల ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ దాంపత్యం సాఫీగా సాగుతుంది.
  • భార్యాభర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు లేదా ఒకరి ప్రవర్తన మరొకరికి నచ్చనప్పుడు నెమ్మదిగా కూర్చుని చర్చించడానికి ప్రయత్నించాలి. అలాకాకుండా ఇద్దరి గొడవకి జడ్జ్‌మెంట్‌ కోసం మూడో వ్యక్తిని ఆశ్రయించొద్దు. ఎందుకంటే దీనివల్ల మీ బంధంపై వారికి చులకన భావం ఏర్పడుతుంది. అంతేకాదు, వారు ఇచ్చే సలహాలు పాటిస్తే మీ దాంపత్యం బీటలు వారుతుంది కూడా. 
  • కొంతమంది భాగస్వాములు తమకున్న ప్రేమను వ్యక్తపరచడానికి ఆలోచిస్తారు. మొహమాటంతో కొందరు చెప్పలేరు, మరికొందరు నేనెందుకు ముందు చెప్పాలి అనే ఈగో చూపిస్తుంటారు. దీనివల్ల మీలో ప్రేమ రోజురోజుకి తగ్గి కోపం, దూరం పెరుగుతుంది. ఇవేవికాకుండా నువ్వా నేనా అనే తేడా లేకుండా సందర్భానుసారంగా ప్రేమను వ్యక్తం చేస్తేనే మంచిది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్