ఇవీ కలవాలి మరి!

‘మంచి ఉద్యోగం, అభిరుచులు కలిశాయి, నేనంటే ప్రేమ అందుకే వెంటనే ఓకే చెప్పేశా’ దాంపత్యంలోకి అడుగుపెట్టే ఎంతోమంది అమ్మాయిల నుంచి వినిపించే మాటే ఇది. కానీ ఇవే చాలవు. మరికొన్ని కలిశాకే ముందడుగు వేయమంటారు నిపుణులు.

Published : 17 Feb 2024 02:13 IST

‘మంచి ఉద్యోగం, అభిరుచులు కలిశాయి, నేనంటే ప్రేమ అందుకే వెంటనే ఓకే చెప్పేశా’ దాంపత్యంలోకి అడుగుపెట్టే ఎంతోమంది అమ్మాయిల నుంచి వినిపించే మాటే ఇది. కానీ ఇవే చాలవు. మరికొన్ని కలిశాకే ముందడుగు వేయమంటారు నిపుణులు.

  • నమ్మకాలు, విలువలు కలిశాయా? ప్రేమ ఉంటే చాలు, ఇవన్నీ అక్కర్లేదు అని మొదట్లో అనిపించొచ్చేమో కానీ, చాలావరకూ గొడవలు అక్కడే మొదలవుతాయి. కొందరమ్మాయిలు పెళ్లయ్యాక అమ్మానాన్నల బాధ్యత మాదే అనుకుంటారు. అవతలివాళ్లు అందుకు విరుద్ధంగా ఉండొచ్చు. అప్పుడు గొడవలు పడితే ఏం లాభం?
  • మంచి ఉద్యోగం సరే! వేళల సంగతేంటి? మీరు ఉదయాన్నే ఆఫీసుకి వెళ్లి, సాయంత్రానికి ఇంటికి వస్తుండొచ్చు. అవతలి వ్యక్తికి రాత్రయితే? పోనీ మీకు పెందలాడే నిద్రపోయి, లేచే అలవాటుంటే, అవతలి వాళ్లది దానికి వ్యతిరేక జీవనశైలి అయినా ఇబ్బందే. చిన్నగా అనిపించినా కలిసి సాగేప్పుడు కష్టంగా తోస్తాయి.
  • అవతలి వ్యక్తి నుంచి ఏం కోరుకుంటున్నారు? ఉదాహరణకు మీకు ఉద్యోగం చేయాలి, పెళ్లయిన మూడేళ్ల వరకూ పిల్లలొద్దు లాంటి అభిప్రాయాలుండొచ్చు. అవతలి వాళ్లేమో మీరు ఇంట్లోనే ఉండి, బాధ్యతలు నిర్వర్తించాలి అని కోరుకుంటుండొచ్చు. అప్పుడొచ్చేదీ తగాదాలేగా!
  • అభిప్రాయ భేదాలు పెళ్లయ్యాకే కాదు... ముందూ రావొచ్చు. అప్పుడు అవతలి వాళ్ల ప్రవర్తన ఎలా ఉంది? కూర్చొని మాట్లాడుతున్నారా? దాన్ని కొనసాగకుండా ఆపేస్తున్నారా? కలిసి చర్చించుకుంటే ఏ సమస్యకైనా సమాధానం దొరుకుతుంది. మరోసారి అది పునరావృతం కాదు. అలాకాకుండా వినిపించుకోని ధోరణి అయితే ఇప్పుడే దూరమవ్వడం మేలు.
  • తొలిరోజుల్లో స్నేహితులు, బంధువులు ఎవరూ కనిపించనంతగా సంభాషణలు సాగుతాయి. ప్రేమే లోకంగా సాగుతారు, ప్రతిక్షణం ప్రేమించిన వారితోనే గడపాలి అనుకుంటారు కాబట్టి, మామూలే! ఆ తర్వాత? అలాగే సాగాలంటే కష్టం కదా? ప్రతిక్షణం నాతోనే ఉండాలి, మరెవరితోనూ మాట్లాడటానికీ వీల్లేదు అన్నట్టు ఉంటే అది ప్రేమ కాదు. పొసెసివ్‌నెస్‌ అనీ భ్రమ పడొద్దు. తీరు మార్చుకోమనండి. మార్చుకున్నారా సరే! లేదంటే దూరంగా ఉండటమే మేలు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్