టీనేజీ పిల్లలతో సరదాగా....

కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు యుక్తవయసుకు రాగానే క్రమశిక్షణ, భద్రత అంటూ వారి స్వేచ్ఛను కట్టేస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదు అంటున్నారు నిపుణులు.

Updated : 20 Feb 2024 14:05 IST

కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు యుక్తవయసుకు రాగానే క్రమశిక్షణ, భద్రత అంటూ వారి స్వేచ్ఛను కట్టేస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదు అంటున్నారు నిపుణులు. అలాకాకూడదంటే..

  • టీనేజ్‌లో పిల్లలు ఏ విషయాన్నీ ఓపెన్‌గా చెప్పరు. రహస్యంగా దాచేస్తుంటారు. అలా అని చెప్పి వారిని ఒత్తిడి చేసి ఏ విషయం చెప్పించడానికి ప్రయత్నించొద్దు. అలాకాకుండా మీరే వాళ్లు కాలేజీ నుంచి వచ్చాక లేదా రాత్రి తినే సమయంలో ఈరోజు ఎలా గడిచింది, స్నేహితుల ముచ్చట్లు ఏంటీ అంటూ సరదాగా అడగండి. ఇలా వారితో ప్రేమగా మాట్లాడినప్పడు వాళ్లు మీతో ఏ విషయమైనా చెప్పడానికి ఇష్టపడతారు.
  • పిల్లలు యుక్త వయసుకు రాగానే కొందరు తల్లిదండ్రులు క్రమశిక్షణ, నియమాలు అంటూ వారిని ఇంటికే పరిమితం చేసేస్తుంటారు. దాని వల్ల వారు బయట పరిచయాలకు ఎక్కువ అలవాటు పడతారు. మీకు చెప్పకుండానే ఏదో సాకు చెప్పి వెళ్లిపోతుంటారు. వారాంతంలో వారికి నచ్చిన ప్రదేశానికి తీసుకొని వెళ్లండి. మీతో గడిపేటప్పుడు బోర్‌ కొడుతుందనిపించకుండా వాళ్లతో కలిసి ఆటలు ఆడడం, ఫొటోలు దిగడం చేయండి.
  • ఈ వయసులో పిల్లలు ఎక్కువగా బహుమతులు అంటే ఆసక్తి చూపిస్తారు. అందుకే వారు ఏ మంచి పనిచేసినా పొగడటం లేదా చిన్న బహుమతులు ఇస్తూ వారిని ప్రశంసించండి. ఇంట్లో ఉన్నప్పుడు వారితో మాట్లాడే సమయం ఎక్కువగా ఉండేలా చూసుకోండి. కలిసి భోజనం చేసేలా చూసుకోండి. దీనివల్ల కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వాలనేది వాళ్లకి అర్థమవుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్