చిన్నారుల ప్రవర్తన మార్చండిలా..

పిల్లలు జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే ప్రవర్తన చాలా ముఖ్యం. అందుకే ముందు నుంచే కొన్ని యాక్టివిటీలను వారికి అలవరచాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..

Published : 21 Feb 2024 01:43 IST

పిల్లలు జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే ప్రవర్తన చాలా ముఖ్యం. అందుకే ముందు నుంచే కొన్ని యాక్టివిటీలను వారికి అలవరచాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..

చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు మొదట ఏ పలకనో, పుస్తకమో కొనిస్తుంటారు కదా! వాటికంటే కూడా డ్రాయింగ్‌ వస్తువులు, బ్లాక్‌ బిల్డింగ్‌, ఫోల్డింగ్‌ పేపర్‌ వంటి ఆట వస్తువులను ఇమ్మంటున్నారు పరిశోధకులు. ప్రీస్కూల్‌ పిల్లలు ఎవరైతే ఎక్కువగా వాటితో ఆడతారో వారిలో ఫైన్‌ మోటార్‌ స్కిల్స్‌ పెరిగినట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేకాదు దీనివల్ల పిల్లలు చదువుల్లో మెరుగ్గా ఉండటమే కాకుండా మంచి ప్రవర్తనా అలవరచుకుంటారట. ఈ నైపుణ్యాలు లేని పిల్లల్లో ప్రైమరీ, సెకండరీ స్కూల్‌ దశలో ఏడీహెచ్‌డీ లాంటి ప్రవర్తనా సమస్యలు కనిపించాయట. అందుకే పిల్లలు చదవాలన్నా, మంచి ప్రవర్తనతో మెలగాలన్నా ఇటువంటి నైపుణ్యాలు నేర్చుకునేలా ప్రోత్సహించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్