పిల్లలు అబద్ధాలు ఆడుతున్నారా?

ఎదిగే చిన్నారులు చెప్పే ముద్దు ముద్దు మాటలకు మురవకుండా ఉండలేం. కానీ, చిన్న విషయానికే వారు అబద్ధాలు చెబుతోంటే మాత్రం అడ్డుకట్ట వేయాల్సిందే అంటారు మానసిక నిపుణులు. పిల్లలు అబద్ధం చెబుతున్నారని తెలిసినవెంటనే వారిని కొట్టడమో, తిట్టడమో చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.

Published : 26 Feb 2024 02:15 IST

ఎదిగే చిన్నారులు చెప్పే ముద్దు ముద్దు మాటలకు మురవకుండా ఉండలేం. కానీ, చిన్న విషయానికే వారు అబద్ధాలు చెబుతోంటే మాత్రం అడ్డుకట్ట వేయాల్సిందే అంటారు మానసిక నిపుణులు.

అంచనా వేయండి: పిల్లలు అబద్ధం చెబుతున్నారని తెలిసినవెంటనే వారిని కొట్టడమో, తిట్టడమో చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. పైగా అలా చేస్తే వారు తరవాత కూడా మీ నుంచి తప్పించుకోవడానికి ఈ అలవాటుని కొనసాగించే అవకాశం ఉంది. అందుకే, ముందు అలా ఎందుకు చెప్పారో తెలుసుకోండి. దీనికి మీ ఇంటి వాతావరణం లేదా మరే ఇతర ప్రభావాల న్నా వాళ్ల మీద పనిచేస్తున్నాయో గమనించి పరిష్కారం వెతకండి.

వాస్తవాలను వివరించండి...  వారేదైనా విషయం దాచడానికే ఆ పని చేస్తుంటే అలా చేయడం వల్ల జరిగే నష్టాన్ని వివరించండి. దాన్ని మీతో పంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనం చెప్పండి. ఒకవేళ వారు చెప్పిన విషయంలో అసలు వాస్తవాలు మీకు తెలిస్తే... వారికి అర్థమయ్యేలా చెబితే మరోసారి ఆ పని చేయరు.

మీరే రోల్‌మోడల్‌... చాలా ఇళ్లల్లో పెద్దలు పిల్లలు ఏం చేయకూడదో, ఎలా ఉండకూడదో చెబుతారు. కానీ, ఆచరణలో తాము మాత్రం ఆ పనిచేయరు. పైగా ఒక్కోసారి చిన్నారులతోనే ‘నేను ఇంట్లో లేనని చెప్పు’, ‘గొలుసు కొనుక్కున్నామని నానమ్మకి చెప్పకు’ అంటూ వారితోనే అబద్ధాలు చెప్పిస్తుంటారు. మీరు మాత్రం అలా చేయొద్దు. ఆపత్కాలానికి తప్ప మరెప్పుడూ అబద్ధమాడకూడదని అర్థమయ్యేలా మీరు ప్రవర్తించాలి. వారికి రోల్‌మోడల్‌ కావాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్