తగ్గి చూడండి

ఇంట్లో కంటే ఆఫీసుల్లోనే ఎక్కువ సమయం గడిపేసే పరిస్థితులున్న రోజులివి. దీంతో ఆలుమగలుగా మీరు ఒకరితో ఒకరు గడిపే సమయం తక్కువే. ఇది కాస్తా మీ మధ్య అసహనాన్నీ, అభద్రతనూ పెంచకూడదంటే...

Published : 01 Mar 2024 02:00 IST

ఇంట్లో కంటే ఆఫీసుల్లోనే ఎక్కువ సమయం గడిపేసే పరిస్థితులున్న రోజులివి. దీంతో ఆలుమగలుగా మీరు ఒకరితో ఒకరు గడిపే సమయం తక్కువే. ఇది కాస్తా మీ మధ్య అసహనాన్నీ, అభద్రతనూ పెంచకూడదంటే...

మీరు ఆఫీసు నుంచి ఎంత పని ఒత్తిడితో వచ్చినా సరే, ఆ ప్రభావాన్ని భాగస్వామి మీద పడనీయొద్దు. ఒకవేళ మీకు పనిలో సహకారం కావాలంటే మీ సమస్య చెప్పి చూడండి. ఆ ఇబ్బందిని దాటే వరకూ మానసికంగా మీకు తోడుండమని అడగండి. కుటుంబ బాధ్యతలను పంచుకోమనండి. ఇవన్నీ మీ మధ్య అగాథం, భారం... పెరిగిపోకుండా కాపాడేవే.

  • కోపంలో ఉన్నప్పుడు ఓ మాట రువ్వేస్తాం. అవతలివారు అసహనంగా మాట్లాడితే... మూతి ముడుచుకుంటాం. ఇలా పదే పదే మీ అసహనాన్ని వ్యక్తం చేయడం మంచిదికాదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడ,మగ తేడాలేకుండా అందరికీ కుటుంబ బాధ్యతలతో పాటు ఆఫీసులో ఒత్తిళ్లు అదనం. వాటి భారాన్ని అవతలివారు మోయలేనప్పుడు ఇద్దరి మధ్యా సంబంధాలు దెబ్బతింటాయి. వాటిని గమనించుకోండి. రోజూ కొంత సమయం మనసువిప్పి మాట్లాడుకోండి. ఒకవేళ అవతలివారిదే పొరపాటైనా మీరే కాస్త తగ్గి ్గచూడండి. గొడవ సద్దుమణుగుతుంది. ఇలా చేసినప్పుడే వృత్తి, వ్యక్తిగత జీవితాలు సమన్వయమవుతాయి.
  • కలిసి చేయండి... మీకున్న కొద్దిపాటి సమయాన్నీ సద్వినియోగం చేసుకోవాలన్నా, ఒకరిపైనే బాధ్యత భారం పడకూడదన్నా... ఎవరి పనులు వారు పంచుకోండి. లేదంటే వాటిని కలిసి చేయండి. దీనివల్ల ఇద్దరిలోనూ ఒత్తిడి తగ్గుతుంది. అన్నీ నేనే చేయాలా అనే బాధా ఉండదు. అయితే, ఇక్కడ నేనే బాగా చేశా, నీకేపనీ రాదు...అంటూ ఒకరినొకరు ఎత్తి పొడుచుకోవడం మాత్రం చేయొద్దు. అప్పుడే మీరు నాణ్యమైన సమయం గడపగలరు. సంతోషంగానూ ఉండగలుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్