యుక్త వయసు నుంచీ...!

ఇంటర్‌ చదువుతున్న రమ్య కాలేజీ నుంచి వచ్చాక స్నానం సంగతెలా ఉన్నా... కనీసం ముఖం కడగదు.  ఈ అలవాటు మానుకోమని చెప్పినా వినదు.  కానీ యుక్తవయసులో చర్మసంరక్షణపై శ్రద్ధ వహిస్తేనే.. భవిష్యత్తులో అందంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు.

Published : 17 Mar 2024 01:54 IST

ఇంటర్‌ చదువుతున్న రమ్య కాలేజీ నుంచి వచ్చాక స్నానం సంగతెలా ఉన్నా... కనీసం ముఖం కడగదు.  ఈ అలవాటు మానుకోమని చెప్పినా వినదు.  కానీ యుక్తవయసులో చర్మసంరక్షణపై శ్రద్ధ వహిస్తేనే.. భవిష్యత్తులో అందంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇందుకోసం వారికెలా అవగాహన కల్పించాలంటే...

  • ఎదుగుతోన్న పిల్లల్లో హార్మోన్ల హెచ్చు తగ్గులు సహజం. ఈ మార్పునకు చదువుల ఒత్తిడి తోడైతే చర్మం ప్రభావితమవుతుంది. దీంతో మొటిమలు, బ్లాక్‌, వైట్‌ హెడ్స్‌ వంటివి మొదలవుతాయి. ప్రాథమిక దశలోనే వీటిని నిరోధించకపోతే అది శాశ్వత సమస్యగా మారొచ్చు. ఈ ఇబ్బందిని దాటేయాలంటే... ఒత్తిడి తగ్గించుకోవడం, పరిశుభ్రత పాటించడం, ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు చేసుకోవడం తప్పనిసరని వారికి వివరించండి. క్రమంగా దాన్ని పాటిస్తారు..
  • స్కూల్‌, కాలేజీ నుంచి వచ్చిన వెంటనే స్నానం చేయమనాలి. లేదంటే ఉదయం నుంచీ ముఖంపై పేరుకున్న మురికీ, చెమట వల్ల చర్మం ఎలా ప్రభావితమవుతుందో చెప్పాలి. యుక్తవయసుకొచ్చేసరికి వారిది ఎలాంటి చర్మతత్త్వమో అర్థమవుతుంది.  దానికి అనగుణంగా సబ్బు లేదా ఫేస్‌వాష్‌ను ఎంపిక చేసిస్తే సరి. చర్మం ఆరోగ్యకరంగా ఉంటుంది.
  • ఈ రోజుల్లో రసాయనాల్లేని, గాఢత తక్కువ క్లెన్సర్స్‌ లభ్యమవుతున్నాయిప్పుడు. ఉదయాన్నే ముఖం మైల్డ్‌ క్లెన్సర్‌తో శుభ్రపరుచుకోమనండి. ఇవి చర్మరంధ్రాల్లో మురికిని దూరం చేస్తుంది. ముఖం కడిగాక తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్‌, ఆరాక సన్‌స్క్రీన్‌ రాయించాలి. ఎండ, దుమ్ము ప్రభావం పడకుండా ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. రాత్రి నిద్రకు ముందు ముఖం కడిగి మాయిశ్చరైజర్‌ రాసే అలవాటు చేయాలి. 
  • టీనేజీ వయసులో అమ్మాయిలకు మేకప్‌పై మోజు ఉంటుంది. మితిమీరి ప్రయత్నిస్తే వాటిల్లో రసాయనాలు...చర్మానికి హాని కలిగిస్తాయన్న విషయం వివరించండి. సేంద్రియ ఉత్పత్తులు ఎంపిక, సహజ పదార్థాల వినియోగం...తెలిసేలా చేయండి. వారు దాన్ని కొనసాగిస్తారు.
  • వారానికి రెండు లేదా మూడుసార్లు తలస్నానం చేస్తే చుండ్రు రాదని చెప్పాలి. రోజులో కనీసం రెండు లీటర్ల నీటిని తాగడం, పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేస్తే చాలు. వారి ఆరోగ్యంతోపాటు యుక్తవయసులో ఎదురయ్యే చర్మ సమస్యలకూ... చెక్‌ పెట్టొచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్