ఒక మెట్టు దిగితే చాలు...

ఆలుమగలన్నాక చిన్న చిన్న గొడవలు సహజం. వాటిని అర్థం చేసుకుని ముందుకు సాగితే బంధం బాగుంటుంది. కానీ ఈరోజుల్లో దంపతుల మధ్య వచ్చే గొడవలకి అభిప్రాయ భేదాలే కారణమట. మరి అవేంటో తెలుసుకుని సరిదిద్దుకోండి.

Published : 19 Mar 2024 01:08 IST

ఆలుమగలన్నాక చిన్న చిన్న గొడవలు సహజం. వాటిని అర్థం చేసుకుని ముందుకు సాగితే బంధం బాగుంటుంది. కానీ ఈరోజుల్లో దంపతుల మధ్య వచ్చే గొడవలకి అభిప్రాయ భేదాలే కారణమట. మరి అవేంటో తెలుసుకుని సరిదిద్దుకోండి.

  • పెళ్లికాకముందు జీవితం ఎలా ఉన్నా అయ్యాక మాత్రం ఒకరికొకరు కొన్ని విషయాల్లో సర్దుకుపోవడం తప్పనిసరి. అలాకాదని ఒకరి అభిప్రాయాలతో మరొకరు ఏకీభవించకపోతే గొడవలు మొదలవుతాయి. ఇలాంటి కలతల్ని దూరం చేసుకోవాలంటే ఎలాంటి వివాదం వచ్చినా ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటేనే సమస్య తీరుతుంది. భార్యాభర్తలిద్దరిలో ఒకరు మొండిగా ఉన్నా... మరొకరు ఓ మెట్టు దిగితే తప్పు లేదు. నేను తగ్గేదేంటి అనే ధోరణి వదిలేయాలి.
  • ఎప్పుడైనా భార్యాభర్తల మధ్య ఎటువంటి దాపరికాలు ఉండకూడదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇప్పటి జంటల్లో గొడవలు రావడానికి డబ్బే కారణం అవుతుందట. ఇద్దరూ సంపాందించి, పొదుపు-మదుపు విషయాల్లో ఎవరి నిర్ణయాలు వాళ్లు తీసుకోవడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అందుకే అన్ని విషయాలను భాగస్వామితో పంచుకోవడం మంచిదంటున్నారు. ఇద్దరూ కలిసి పెట్టుబడి పెట్టడం, ఆస్తులు కొనడం వల్ల ఇరువురి బంధం బాధ్యతాయుతంగా ఉంటుంది.
  • పనుల విషయం వచ్చేసరికి నువ్వు వంటింటికే పరిమితం నేను ఆఫీసుకే అంకితం అని అనుకోకుండా.. అలా వారంలో బయటకు వెళ్లడం లేదా ఇంటిలోనే భాగస్వామికి పనిలో చిన్న సాయం చేయడం వల్ల ఇద్దరి మధ్యా అన్యోన్యత పెరుగుతుంది. ఒకరు ఎక్కువ తక్కువ అనే భేదాలు లేకుండా ఉంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్