చిన్నారులకే ఈ ‘గులాల్‌’

చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఎంతో ఉత్సాహంతో జరుపుకొనే పండుగ హోలీ. పిల్లల కోసం బోలెడు పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. అవేంటో ఓసారి చూసేయండి.

Published : 24 Mar 2024 01:23 IST

చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఎంతో ఉత్సాహంతో జరుపుకొనే పండుగ హోలీ. పిల్లల కోసం బోలెడు పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. అవేంటో ఓసారి చూసేయండి.


గులాల్‌ పిచికారీ: ట్యాంక్‌, షూటర్‌, మినీ మౌసర్‌...  బొమ్మలంటే ఇష్టపడని బుడతలు ఉండరు. అలాంటిది ఈ హోలీకి వారికి నచ్చిన బార్బీ గర్ల్‌, చోటాభీమ్‌ వంటి డిజైన్‌ల్లో ఈ పిచికారీ వాటర్‌ ట్యాంక్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అర లీటరు వరకూ నీళ్లు నింపి, బ్యాగులా వీపున తగిలించుకుని సులభంగా గన్‌తో పిచికారీ చేసుకుంటే చాలు.

అంతేకాదు, మినీ మౌసర్‌ చూడటానికి చెంబు ఆకారంలో ఉంటుంది. దీనిలో లిక్విడ్‌ నీళ్లు నింపి రెండు చేతులతో ఒత్తితే చాలు... రంగు పడుద్ది. ఇక గన్‌లు అంటే పిల్లలు మరింత చిందులు వేస్తుంటారు వారికోసమే ఈ షూటర్‌. ఇందులో లిక్విడ్‌ లేదా పొడిని ఉంచి నొక్కితే చాలు.


గులాల్‌ పాపర్స్‌: ఇది చూడ్డానికి పార్టీల్లో ఉపయోగించే స్మోక్‌ స్టిక్‌లా ఉన్నా... ఇందులో రంగు నింపుకొనేందుకు వీలుగా ఉంటుంది. చేతులతో కింద భాగంలో తిప్పితే చాలు. ఇంద్రధనుస్సులా అందంగా రంగును వెదజల్లుతుంది. పైగా ఈ కలర్స్‌ అన్నీ ఎటువంటి రసాయనాలు లేని హెర్బల్‌ పదార్థాలతో తయారైనవి కాబట్టి పర్యావరణానికీ, చర్మానికీ హాని కలిగించవు. పైగా చేతికి రంగు ఎక్కువగా అంటకుండా స్ప్రే బాటిల్‌ల్లో దొరుకుతున్నాయి.


 గులాల్‌ లాంచర్‌: మామూలుగానే పిల్లలు ఇంట్లో హీరోల్లా విన్యాసాలు చేస్తుంటారు. అలాంటి వారికి ఈ గులాల్‌ లాంచర్‌ను బహుమతిగా ఇచ్చి చూడండి. ఇక వారి ఆనందానికి అవధులు ఉండవు. దీని వాడుక కూడా సులభమే.

విల్లులా ఉండే ఈ పరికరంతో రంగుల బంతుల్ని ఎక్కుపెట్టి కొడితే... బంతి పగిలి రంగు అవతలి వాళ్ల మీద పడుతుంది. మరెందుకు ఆలస్యం ఎంచక్కా ఆర్డరు పెట్టి మీ చిన్నారులను ఆనందింపజేసేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్