పిల్లలకీ కావాలో రొటీన్‌!

పిల్లల బాగోగులేగా ఏ అమ్మయినా కోరుకునేది? అయితే వాళ్లకి పోషకాహారం అందించడం, చదువు, ఆరోగ్యంపైనే ఎక్కువ దృష్టిపెడతాం. చర్మ సంరక్షణను మర్చిపోతాం. నిజానికి వాళ్లకీ స్కిన్‌ కేర్‌ రొటీన్‌ కావాలి అంటున్నారు నిపుణులు.

Published : 25 Mar 2024 01:35 IST

పిల్లల బాగోగులేగా ఏ అమ్మయినా కోరుకునేది? అయితే వాళ్లకి పోషకాహారం అందించడం, చదువు, ఆరోగ్యంపైనే ఎక్కువ దృష్టిపెడతాం. చర్మ సంరక్షణను మర్చిపోతాం. నిజానికి వాళ్లకీ స్కిన్‌ కేర్‌ రొటీన్‌ కావాలి అంటున్నారు నిపుణులు...

పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఏది పడకపోయినా అలర్జీలు, దురద వంటివి పలకరిస్తాయి. అందుకే వారికి తగ్గ ఉత్పత్తులు ఎంచుకోవాలి. ముఖ్యంగా రసాయనాలు, పరిమళాలు లేని, నాన్‌ ఇరిటేటింగ్‌ స్కిన్‌ కేర్‌ ప్రొడక్ట్స్‌కి ప్రాధాన్యమివ్వాలి. వారి చర్మ అవసరాలూ వేరేగా ఉంటాయి. కాబట్టి, వారికోసమే ప్రత్యేకంగా తయారుచేసిన వాటిని వాడటమే మేలు. ఇంకా క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం రాసుకునేలా చూడండి. చర్మం ఆరోగ్యంగా ఉండటమే కాదు, స్వీయ సంరక్షణ, తమని తాము పట్టించుకోవడం వంటి లక్షణాలూ అలవడతాయి.

  • ఎండ ప్రభావం వారిపైనా పడుతుంది. ముఖ్యంగా క్యాన్సర్‌ అవకాశాలు ఉంటాయి. కాబట్టి, సన్‌స్క్రీన్‌నీ తప్పనిసరి చేయాలి.
  • బ్రష్‌ చేయడానికే విసిగిస్తారు... ఇవన్నీ చేస్తారా అన్న సందేహం వస్తుంది కదూ! చిన్నచిన్న రంగుల పోస్టర్లు అతికించడం, దాన్నో ఆటలా మార్చడం లాంటివి చేయండి. చక్కగా చేస్తారు. ముఖ్యంగా పిల్లలు మనల్నే అనుసరిస్తారు. మీరు సంతోషంగా చేయండి... చేస్తూ వాళ్లనీ ప్రోత్సహించండి. చక్కగా చేస్తారు. అయితే దానికి కొంత సమయమూ పడుతుంది. కాస్త ఓపికగా మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి మరి!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్