ముందు మీరు అనుసరిస్తున్నారా?

అమ్మలకుండే పెద్ద చింత... పిల్లల ఆరోగ్యమే. నిజానికి పనుల హడావుడిలో పడి మనం చేసేదేంటి? ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడమేగా! అందుకే ముందు మీరు కొన్ని అలవాట్లు చేసుకుంటే ఇంట్లోవాళ్లూ అనుసరిస్తారు.

Published : 02 Apr 2024 01:59 IST

అమ్మలకుండే పెద్ద చింత... పిల్లల ఆరోగ్యమే. నిజానికి పనుల హడావుడిలో పడి మనం చేసేదేంటి? ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడమేగా! అందుకే ముందు మీరు కొన్ని అలవాట్లు చేసుకుంటే ఇంట్లోవాళ్లూ అనుసరిస్తారు.

  • బ్రష్‌ చెయ్‌, స్నానం అయ్యిందా... ఉదయాన్నే ప్రతి ఇంట్లో వినిపించే మాటలే ఇవి. మనం పనులతో హడావుడి పడతాం... ఆ తొందరనే వాళ్లపైనా రుద్దుతాం. అలాకాకుండా ఉదయాన్నే కాస్త మొక్కల మధ్య, నీరెండలో నడవండి. పిల్లల్నీ మీతోపాటు తీసుకెళ్లండి. స్వచ్ఛమైన గాలి, ఉదయపు ఎండ ద్వారా వచ్చే విటమిన్‌ డి శరీరానికే కాదు, మనసుకీ ప్రశాంతతనిస్తాయి. రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి.
  • స్వచ్ఛమైన నవ్వు ఎంతమందిలో కనిపిస్తుంది? రోజంతా ఏదో ఒక ఆందోళనతో నిండి ఉంటే అందమైన నవ్వు జాడ ఎలా కనిపిస్తుంది? కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏకాగ్రత, నెమ్మదితనం అలవాటవుతాయి.
  • సమయానికి తినాలి, అవి వద్దు, ఇవొద్దు అనకూడదు అని చెబుతాం. మరి మీరు అనుసరిస్తున్నారా? మీరు వేళలు పాటిస్తూ వాళ్లనీ తినమనండి. పనులు పూర్తవవన్న కంగారు సహజమే కానీ వీలు చేసుకోక తప్పదు. ఇది మంచిది అని కాకుండా శరీరానికి ఎలా సాయపడుతుందో వివరంగా చెప్పండి. అప్పుడే రుచి చూడటానికి ఆసక్తి కనబరుస్తారు.
  • బయటికి వెళ్లడం, నలుగురితో మాట్లాడటం వంటివి లేకుండా ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాం. టీవీ లేదా ఫోనే వ్యాపకం. వాళ్లు నేర్చుకునేదీ మనల్ని చూసేగా? అదే పుస్తకాలతో దోస్తీ చేయండి. వాళ్లూ అనుసరిస్తారు. పిల్లల్లో మార్పు రావాలంటే ముందు మారాల్సింది మనమే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్