అలాంటి వారు ఒక్కరున్నా చాలు!

బాల్యమే బంగారు భవిష్యత్తుకు పునాది అంటారు. ఈ దశలో మనం ఎదుర్కొనే పరిస్థితులే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. అయితే అటువంటి సమయంలో మనల్ని ప్రేమించే, జాగ్రత్తగా చూసుకునే పెద్దవాళ్లు ఒక్కరున్నా చాలు.... పెరిగాక కుంగుబాటు, ఆందోళన లాంటి మానసిక సమస్యలు మన దరిచేరకుండా ఉంటాయట.

Published : 04 Apr 2024 01:34 IST

బాల్యమే బంగారు భవిష్యత్తుకు పునాది అంటారు. ఈ దశలో మనం ఎదుర్కొనే పరిస్థితులే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. అయితే అటువంటి సమయంలో మనల్ని ప్రేమించే, జాగ్రత్తగా చూసుకునే పెద్దవాళ్లు ఒక్కరున్నా చాలు.... పెరిగాక కుంగుబాటు, ఆందోళన లాంటి మానసిక సమస్యలు మన దరిచేరకుండా ఉంటాయట. కొలంబియా యూనివర్సిటీ చేసిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అందుకోసం 2వేలమందికి పైగా యువతపై అధ్యయనం చేశారు. వారి సామాజిక, సాంస్కృతిక అంశాలనూ పరిగణనలోకి తీసుకున్నారు. శారీరక, మానసిక హింసలు, నిరాదరణ, పెంచేవారి మానసిక స్థితి, గృహహింస లాంటి ప్రతికూల పరిస్థితులను పిల్లలు ఎదుర్కొన్నప్పటికీ తల్లిదండ్రులూ, కుటుంబ సభ్యుల్లో జాగ్రత్తగా చూసుకునేవారు కనీసం ఒక్కరున్నా... పిల్లలు వీటి బారినపడే ప్రమాదం తప్పుతుందని తేలిందట. అంతేకాదు అన్ని పరిస్థితుల్లోనూ స్థిరంగా ఉండే మానసిక సామర్థ్యాన్నీ పొందగలుగుతారట. అందుకే ఎప్పుడూ మనం.. మన కుటుంబం.. అన్నట్లు కాకుండా కుటుంబంలోని మిగతా వ్యక్తులతోనూ మంచి సంబంధ బాంధవ్యాలు పిల్లల్లో పెంపొందేలా చూడాలి. అప్పుడే మంచి భవిష్యత్తును వారికి అందించగలం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్