అందం కాదు... ఆత్మవిశ్వాసం అవసరం!

ఈతరం తల్లులకు అందం, ఫ్యాషన్‌లపై కాస్త శ్రద్ధ ఎక్కువ. వీరు తమ పిల్లలకూ ఈ విషయాలను కాస్త ఎక్కువగానే ఒంటపట్టేలా చేస్తున్నారంటున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఈ అలవాటు వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు.

Updated : 08 Apr 2024 02:23 IST

ఈతరం తల్లులకు అందం, ఫ్యాషన్‌లపై కాస్త శ్రద్ధ ఎక్కువ. వీరు తమ పిల్లలకూ ఈ విషయాలను కాస్త ఎక్కువగానే ఒంటపట్టేలా చేస్తున్నారంటున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఈ అలవాటు వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు.

ప్రతి తల్లీ తమ బిడ్డల్ని అందంగా తయారుచేసి చూసుకుని మురిసిపోవాలనుకుంటుంది. అలాగని, అందానికి కొలమానాలు చెప్పడం, ఇలానే తయారవ్వు, అలా చేయి అంటూ ఒత్తిడి తీసుకురావొద్దు. ఒకవేళ అలా తాము లేమని గుర్తించినప్పుడు కుంగుబాటు, లేదు చాలా అందంగా ఉన్నామనుకుంటే అతి విశ్వాసం ఏర్పడే ప్రమాదం ఉంది. ఆత్మవిశ్వాసమే అసలైన అందంగా, పైపై మెరుగులన్నీ అలంకారాలుగా చెప్పండి. అందుకు తగ్గ ఉదాహరణలు ఇవ్వండి. అప్పుడే మీ చిన్నారి భవిష్యత్తు బంగారు బాటలో సాగుతుంది.

  • చిన్నారులు...ప్రతి విషయాన్నీ మనసుకి పట్టించుకుంటారనే విషయం మరిచిపోవద్దు. బరువు, పళ్లు, కళ్లు, రంగు, నడక, మాట... ఇలా వారిలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపుతూ పిలుస్తుంటారు. బండోడా, నల్లదానా....అంటూ రకరకాల పేర్లతో పిలవడం వల్ల ఆ పసిమనసులు చిన్నబుచ్చుకోవచ్చు. ఈలోపాలు తమ ఎదుగుదలకు ఆటంకమనే భ్రమలో పడిపోవచ్చు. అలాంటివేమైనా గుర్తిస్తే ఓదార్పునివ్వండి. ఎన్ని అవకరాలున్నా... ఆత్మబలంతో పైకెదిగిన వారి స్ఫూర్తి కథలు చెప్పండి. ఇవన్నీ వారు తమకున్న ఇబ్బందులు అధిగమించే స్థైర్యాన్నిస్తాయి.
  • ఎవరికోణంలో వారు అందాన్ని నిర్వచించొచ్చు. అంతమాత్రాన... ఇతరులతో పొల్చి చిన్నబుచ్చడం, ఎదుటివారిని అనుసరించమనడం సరికాదు. ఖరీదైన వస్తువుల్లోనే అందం దాగి ఉంటుందనే అపోహల్ని నూరిపోయొద్దు. మీ అభిప్రాయాల్నీ బలవంతంగా వారిపై రుద్దొద్దు. ఉన్నదాంట్లోనే శుభ్రంగా ఉండటం, అవసరమైనప్పుడు సర్దుకుపోవడం వంటివి అలవాటు చేయండి. తమకి ఏది నప్పుతుందో వారే తెలుసుకుంటారు. సంతృప్తిగానూ సాగిపోతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్