ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయా?

భార్యాభర్తలిద్దరి ఆలోచనలు ఒకేలా ఉండాలని రూలేం లేదు. ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుంటూ మంచిచెడులను తర్కించుకుంటూ ఒకటిగా అడుగేసినప్పుడే ఆ దాంపత్యం కలకాలం నిలుస్తుంది. అందుకు ఇద్దరూ ఒకరి మాటను ఒకరు విని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Published : 11 Apr 2024 01:45 IST

భార్యాభర్తలిద్దరి ఆలోచనలు ఒకేలా ఉండాలని రూలేం లేదు. ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుంటూ మంచిచెడులను తర్కించుకుంటూ ఒకటిగా అడుగేసినప్పుడే ఆ దాంపత్యం కలకాలం నిలుస్తుంది. అందుకు ఇద్దరూ ఒకరి మాటను ఒకరు విని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా కాకుండా తమ భాగస్వామి మాట్లాడేటప్పుడు ఎప్పుడూ, ఎదో ఒక ఫిర్యాదు చేస్తూనే ఉంటుంది అంటూ తీసిపడేసినా, వినీవిననట్లు ఉన్నా పొరపచ్చాలు తప్పవు. అపార్థాలకు తావివ్వకూడదంటే ఇలా చేసి చూడండి...

మీ భాగస్వామి వ్యక్తిగత, వృత్తిగత, కుటుంబ విషయమై ఏదైనా మీకు ఫిర్యాదు చేసినప్పుడు దాన్ని తారీఖుతో సహా వారిముందే డైరీలో రాసుకోండి. దీనివల్ల మూడు ఉపయోగాలు ఉన్నాయి.

  • సమస్యపై మీరు స్పందించడం లేదనో, పట్టించుకోవడం లేదనో భావన వారిలో పోతుంది. తప్పు మీలో ఉంటే దాన్ని సరిచేసుకుని మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తపడచ్చు.
  • మీరు సమస్య వింటున్నారు, దాన్ని సరిచేసుకునేందుకు ప్రయత్నిస్తారని వాళ్లకు తెలుస్తుంది. దాంతో గంభీరంగా ప్రారంభమైన వారి సంభాషణ చల్లబడుతుంది. వాదోపవాదాలు లేకుండా పరిస్థితి గట్టెక్కుతుంది.
  • తీరిక సమయాల్లో ఆ డైరీని తిరగవేయమని చెప్పండి. చిన్నచిన్న విషయాలకే వారు ఫిర్యాదులు చేస్తుంటే దాన్ని మానుకునే అవకాశం ఉంటుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్