పిల్లలు ఎదుగుతూ...!

బుడిబుడి అడుగులేయడంలో మొదట తడబడే బుజ్జాయిలు క్రమేపీ పరుగులూ... పెడతారు. వయసు పెరిగేకొద్దీ వారి ఎదుగుదలలోనూ మార్పు వస్తుంటుంది.

Published : 14 Apr 2024 02:07 IST

బుడిబుడి అడుగులేయడంలో మొదట తడబడే బుజ్జాయిలు క్రమేపీ పరుగులూ... పెడతారు. వయసు పెరిగేకొద్దీ వారి ఎదుగుదలలోనూ మార్పు వస్తుంటుంది. అలా పెరుగుతున్న మీ చిన్నారుల ఎత్తును ఇంట్లోనే ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఈ ఏర్పాటు ఉంటే చాలు. అదేమిటంటే...

చార్ట్‌ రూపంలో...

అట్ట లేదా పలుచని చెక్కమీద మీటర్లు, సెంటీమీటర్ల అంకెలు వేసి ఉండే చార్ట్‌లు వస్తున్నాయి. ఇవి దీర్ఘచతురస్రాకారంగానే కాకుండా జిరాఫీ, ఏనుగు వంటి జంతువుల ఆకారాల్లోనూ మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. ఇటువంటి చార్ట్‌ను చిన్నారుల గదిలో ఉంచాలి.

గోడ మీదా...

పిల్లల గదిలో గోడమీద ఆర్ట్‌ రూపంలో ఎత్తు చూసుకొనే స్కేలును వేయించొచ్చు. వారికి నచ్చేలా రకరకాల డిజైన్ల వాల్‌ఆర్ట్‌ వేయించి, ఆ మధ్యలో స్కేలును గీయించాలి. వన్యప్రాణుల బొమ్మలు, ఇంద్రధనస్సు, సముద్రం, అడవి, అంతరిక్షం వంటి థీమ్‌లతో పిల్లల మనసును ఆకర్షించేలా వాల్‌ఆర్ట్‌ ఉంటే చూడచక్కగానూ ఉంటుంది.

వేలాడేలా...

మూడునాలుగు అడుగులున్న వస్త్రం లేదా దళసరి షీట్ను తీసుకొని దానిపై రంగురంగుల్లో జంతువులు లేదా కార్టూన్ల బొమ్మలను వేయాలి. దానికి సమాంతరంగా స్కేలును గీయాలి. దీన్ని చార్ట్‌లా పిల్లల గదిలో గోడకు వేలాడదీయాలి. కనీసం ఆరునెలలకొకసారి ఎవరికివారు సొంతంగా తమ ఎత్తును చూసుకోవడమెలాగో వారికి నేర్పాలి. ఏ వయసుకెంత ఎత్తు ఉండాలో అవగాహన కలిగించడంతోపాటు పోషకవిలువలున్న ఆహారం తీసుకోవడం, ఆటలు ఆడటం ద్వారా కలిగే ప్రయోజనాలనూ... చెప్పాలి. నిత్యం వారెదుట కనిపించే ఈ హైట్‌ టెస్టింగ్‌ స్కేలు వారిని ప్రోత్సహించేలా ఉంటుంది. గదికి ప్రత్యేక అందాన్నీ తెస్తుంది. మరింకెందుకాలస్యం.. మీ చిన్నారి గదిలో వీటిని ఏర్పాటు చేయండి మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్