మీకు టీనేజీ పిల్లలున్నారా?

టీనేజీ పిల్లల విషయంలో భయాలు, అపోహలు ఉండటం సహజమే. అలాగని ప్రతి చిన్న విషయానికీ వాళ్లని అనుమానించడం, నిందించడం, నియంత్రించడం వంటివి మాత్రం చేయొద్దు. బదులుగా వారితో స్నేహం చేస్తూనే పట్టు జారకుండా చూసుకోవచ్చు అంటారు నిపుణులు.

Published : 15 Apr 2024 06:48 IST

టీనేజీ పిల్లల విషయంలో భయాలు, అపోహలు ఉండటం సహజమే. అలాగని ప్రతి చిన్న విషయానికీ వాళ్లని అనుమానించడం, నిందించడం, నియంత్రించడం వంటివి మాత్రం చేయొద్దు. బదులుగా వారితో స్నేహం చేస్తూనే పట్టు జారకుండా చూసుకోవచ్చు అంటారు నిపుణులు. అదెలాగంటారా...

పిల్లలు ఎదిగే కొద్దీ కొత్త ఆలోచనల్నీ, ఆశల్నీ, లక్ష్యాల్నీ నింపుకొంటారు. వాటికోసం ఆ దిశగా అన్వేషణ మొదలుపెడతారు. ముఖ్యంగా హైస్కూలు దాటి కాలేజీలో చేరేటప్పుడు ఇలాంటివన్నీ చూస్తుంటాం. ఇందుకు హార్మోన్ల మార్పులు, స్నేహాలూ...వంటివి ఎన్నో కారణాలు. అయినంతమాత్రాన వారేదో పక్కదారి పట్టేసినట్లు అనేసుకోకండి. వీటిని సహజంగా భావించి... అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వాళ్ల ఇష్టాయిష్టాలను తెలుసుకుని... వస్తువులూ, దుస్తులు కొనేటప్పుడూ, తినేటప్పుడు పిల్లల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తే సరి. మీపై మరింత ప్రేమ పెంచుకుంటారు.

  • టీనేజీలో స్నేహాలకు ఎక్కువ విలువిస్తారు. అలాగని... మీ బిడ్డలు చేసే తప్పులకు, వైఫల్యాలకూ వాళ్ల ఫ్రెండ్స్‌ని నిందించడం సరికాదు. చెడు స్నేహాల జోలికి పోకూడదనుకుంటే మీరు వాళ్ల స్నేహితుల గురించి తెలుసుకోండి. అందరినీ అప్పుడప్పుడూ పిలిచి ట్రీట్‌ ఇవ్వడం వంటివి చేస్తే సరి. ఆ ఫ్రెండ్స్‌ అలవాట్లు, ఆలోచనలూ సులువుగా పసిగట్టగలరు. వాళ్ల తల్లిదండ్రులతోనూ పరిచయం పెంచుకుని మాట్లాడితే కాస్త భరోసాగా ఉంటుంది.
  • యువత ఎక్కువ సమయం గడిపేది సామాజిక మాధ్యమాల్లోనే. దానికి అలవాటు పడకుండా ఉండాలని మితిమీరిన ఆంక్షలు పెడుతున్నారా? దీనివల్ల మీకు తెలియకుండా ఆ పనిచేసే ప్రమాదం ఉంది. ముందు దాన్ని వారెలా వాడుతున్నారో అర్థం చేసుకోండి. తప్పుదోవ పడుతుంటే... కౌన్సెలింగ్‌ ఇప్పించండి. దాన్ని సరైన దిశలో వాడే విధానం వివరించండి. మీరూ వారి స్నేహితుల జాబితాలో చేరి ట్రెండ్స్‌ గురించి మాట్లాడుతూ ఉండండి. ఇట్టే కలిసిపోతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్