ఆఫీసులో మాట్లాడాలా... వద్దా?

చదువు పూర్తవ్వగానే ఉద్యోగంలో చేరా. నా వయసు వారితో త్వరగా కలిసిపోవడం మామూలే కదా? కానీ అబ్బాయిలతో మాట్లాడుతుంటే మా సీనియర్లు అదోలా చూస్తున్నారు.

Published : 02 May 2024 15:06 IST

చదువు పూర్తవ్వగానే ఉద్యోగంలో చేరా. నా వయసు వారితో త్వరగా కలిసిపోవడం మామూలే కదా? కానీ అబ్బాయిలతో మాట్లాడుతుంటే మా సీనియర్లు అదోలా చూస్తున్నారు. అలాగని సీటులో ఎంతసేపని కూర్చోను? వాళ్ల చూపులేమో నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఇంతకీ ఆఫీసులో మాట్లాడాలా వద్దా?

 ఓ సోదరి

ఒకరితో మరొకరు మాట్లాడటం, అభిప్రాయాలు పంచుకోవడం... లాంటి ‘సోషల్‌ ఇంటరాక్షన్‌’ ఆఫీసులోనే కాదు, రోజువారీ ప్రక్రియలోనూ అవసరమే. అయితే దానికీ కొన్ని పరిమితులు ఉంటాయి. కొత్తగా కాలేజీ నుంచి ఆఫీసులోకి అడుగుపెట్టారు. కాబట్టి, అక్కడి సీరియస్‌ వాతావరణం మీకు ఇంకా అలవాటు కాలేదేమో! సాధారణంగా సంస్థలు తమ ఉద్యోగుల ఉత్పాదకత పెంచాలి అనుకుంటాయి. ఇక సీనియర్లు కొత్తతరం త్వరగా నేర్చుకొని పని అందుకోవాలని కోరుకుంటారు. ఇది ఎక్కడైనా సహజమే! పరిచయం పెంచుకోవాలన్న తాపత్రయంలో మరీ ఎక్కువ సమయం గడిపేస్తున్నారేమో గమనించుకోండి. అలాంటప్పుడు మీపై సమయం వృథా చేస్తోందన్న దురభిప్రాయం కలగడం మామూలే. రోజంతా సీట్లోనే ఉండమని ఎవరూ అనరు. అలాగని అస్తమానూ మాటలతో గడిపేస్తాను అన్నా ఊరుకోరు. కాబట్టి, అమ్మాయైనా అబ్బాయైనా ఎంతసేపు మాట్లాడుతున్నామన్న దానిపై పరిమితి పెట్టుకోవడం మేలు. ఇంకా కొత్త కాబట్టి, మీ ఉద్యోగ నైపుణ్యాలను పెంచుకోండి. పని వివరాలు తెలుసుకోవడం, సందేహాలను నివృత్తి చేసుకోవడంపై ఎక్కువ దృష్టిపెట్టండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉద్యోగి. ఆ ఉద్యోగ బాధ్యతలు, వాటిని నిర్వర్తించడంలో మీ పాత్రను అర్థం చేసుకుంటూ సాగండి. అప్పుడు ఏ సమస్యా ఉండదు. కొద్ది సమయమే మాట్లాడుతున్నా అంటారా ... అయితే పని ప్రాంతంలో జోకులు, సొంత విషయాలను పక్కన పెట్టేస్తే సరి. ఇతరులకూ ఇబ్బంది ఉండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్