నా ప్రేమని... చెప్పనా?

వయసు 16. ఒకబ్బాయిని ఇష్టపడుతున్నా. తనకి నేనంటే ఇష్టమేమీ లేదు. అయినా కనీసం నా ప్రేమని తనకి చెప్పాలి అనిపిస్తోంది. నా నిర్ణయం మంచిదేనా?

Published : 18 May 2024 13:56 IST

వయసు 16. ఒకబ్బాయిని ఇష్టపడుతున్నా. తనకి నేనంటే ఇష్టమేమీ లేదు. అయినా కనీసం నా ప్రేమని తనకి చెప్పాలి అనిపిస్తోంది. నా నిర్ణయం మంచిదేనా?

ఓ సోదరి

పదహారేళ్లు అంటే పూర్తిగా పరిపక్వత కూడా రాని వయసు. వ్యక్తిత్వం కూడా సంపూర్ణంగా రూపుదిద్దుకోదు. ఈ వయసులో ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని విస్మయంగా చూడడం మొదలవుతుంది. ఇష్టపడుతున్నా అనుకుంటారు కానీ... అది ఆకర్షణే! ధరించే దుస్తులు, నగలు, వాహనాలకే కాదు, ఇది వ్యక్తులకీ వర్తిస్తుంది. కొద్దిరోజులయ్యాక అంతలా నచ్చిన వాటిపైనే విసుగు ఏర్పడవచ్చు. అందుకని తొందరపడి ఆ అబ్బాయితో నీ ఇష్టం గురించి చెప్పొద్దు. జీవితంలో ప్రేమ, పెళ్లి అనే అంశాల్లో ప్రతి అడుగూ ఆచితూచి వేయాలి. కంటికి కనిపిస్తున్నదంతా బంగారం అనుకోవద్దు. అయినా వీటన్నింటికీ నీది తగిన వయసు కాదు. పోనీ అతనూ జీవితంలో స్థిరపడలేదు. కాబట్టి, ముందు నీ ఎమోషన్స్‌ని గమనించుకో. అసలే ఆ అబ్బాయికి నీవంటే ఇష్టం లేదని చెబుతున్నావు. ఆ రిజెక్షన్‌ని తట్టుకునే పరిపక్వతా ఉండదు. కాబట్టి, ముందు చదువు, కెరియర్‌పై దృష్టిపెట్టు. జీవితంలో ఓ లక్ష్యాన్ని పెట్టుకొని, దాన్ని సాధించు. అందమైన భవిష్యత్తుకు పునాది పడే వయసు ఇది. కొత్తవి ప్రయత్నించాలి, ప్రయోగాలు చేయాలని మనసు ప్రేరేపిస్తుంది. దాన్ని మీ కెరియర్‌కి, భవిష్యతుకు సాయపడే అంశాలవైపు మళ్లించి చూడు. అద్భుతాలు సాధిస్తావ్‌. ఆ ఆనందం ముందు, ఈ ఆకర్షణలన్నీ నీటి బుడగల్లాంటివే.


ఒకసారేమో ‘చిన్నపిల్లవి నీకేం తెలీ’దంటారు. మళ్లీ వాళ్లే ఇంకోసారి ‘పెద్దదానివి అయ్యావు ఆ మాత్రం తెలీదా’ అంటారు. టీనేజీ పిల్లలు ఎదుర్కొనే పరిస్థితే ఇది. తెలియని చిరాకు, కోపం, కొత్తగా పరిచయమయ్యే ఎమోషన్స్‌... ఎవరితో ఎలా పంచుకోవాలో, సందేహాలను ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదా? వాటిని మాకు పంపండి. నిపుణుల ద్వారా సలహాలు అందిస్తాం. మా ఈ-మెయిల్‌: ‌vasundhara@eenadu.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్