సుతిమెత్తగా... చిన్నారులకు హాయిగా..!

కారులో దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కొంతసేపు సరదాగా గడిపినా.. ఆ తర్వాత అలసిపోయి పిల్లలు నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటారు. కునుకు వేసేలోపే మెడనొప్పి అంటూ పెద్దవాళ్ల ఒడి వెతుక్కుంటారు.

Published : 19 May 2024 01:47 IST

కారులో దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కొంతసేపు సరదాగా గడిపినా.. ఆ తర్వాత అలసిపోయి పిల్లలు నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటారు. కునుకు వేసేలోపే మెడనొప్పి అంటూ పెద్దవాళ్ల ఒడి వెతుక్కుంటారు. ఇలా ఎంతో దూరం ప్రయాణించలేరు. సరదాగా సాగాల్సిన టూర్‌ అనారోగ్యాలతో పూర్తవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ దిండ్లు ఉండాల్సిందే.

సీట్‌బెల్ట్‌లా...

కారు సీటు బెల్ట్‌కు ఈ దిండును తొడిగే వీలుంటుంది. లేదా స్ట్రాప్‌తో అటాచ్‌ చేయొచ్చు. పిల్లలు కూర్చున్న వెంటనే దిండు తొడిగిన బెల్ట్‌ వేస్తే చాలు. కదలకుండా ఉంచడమే కాదు, మెత్తగానూ అనిపించే ఈ దిండు తల్లి వద్ద ఉన్న అనుభూతిని అందిస్తుంది. ఎటువంటి అసౌకర్యం లేకుండా చిన్నారులు హాయిగా నిద్రలోకి జారుకుంటారు. వీటిలో కొన్ని చిన్నారులకు భుజం నుంచి పొట్ట చుట్టూతా వచ్చేలా పొడవుగా ఉండే రకాలున్నాయి. రకరకాల జంతువుల బొమ్మల ఆకారాల్లోనూ, ఆకర్షణీయమైన రంగుల్లోనూ ఇవి లభ్యమవుతున్నాయి. అలాగే మరికొన్ని మెడ వరకు మాత్రమే వచ్చేలా, అర్ధచంద్రాకారంలో తలకు మాత్రం సపోర్ట్‌ ఇస్తాయి.

తగిలించేలా...

ఆంగ్ల అక్షరం హెచ్, యూ ఆకారంలో ఉండే ఈ మెత్తని దిండుకు వెనుకవైపు తాళ్లుంటాయి. పిల్లలు కూర్చున్న తర్వాత సీటుకు ఈ దిండును పైనుంచి తగిలించి వెనుకవైపు తాళ్లను ముడివేస్తే చాలు. దిండు కదలకుండా మెత్తగా పిల్లలకు సపోర్ట్‌ ఇస్తుంది. సీటుకు జేరబడి, తమకు పైభాగంలో వచ్చేలా దిండును సర్దుకొంటారు పిల్లలు. హాయిగా నిద్రపోయి, ఆ తర్వాత ప్రయాణాన్ని ఉత్సాహంగా ఎంజాయ్‌ చేస్తారు. ఈ దిండ్లు భలేగున్నాయి కదూ... మరింకెందుకాలస్యం. మీ చిన్నారులకూ అందించేయండి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్