పిల్లలకూ చెక్క సామాన్లు..!

అల్యూమినియం పాత్రల్లో వండొద్దనీ, ప్లాస్టిక్‌ బౌల్స్‌లో వేడివేడి ఆహారం వడ్డించకూడదనీ నిపుణులు చెబుతున్నారు. వీటిలోని రసాయనాలు తీవ్ర అనారోగ్యాలకు దారి తీస్తాయని హెచ్చరిస్తుండటంతో చెక్క, వెదురుతో తయారయ్యే ప్లేట్లు, బౌల్స్‌ వినియోగం పెరిగింది. ఇందులో చిన్నారులకు ప్రత్యేకమైనవీ వచ్చేశాయి.

Published : 26 May 2024 00:56 IST

అల్యూమినియం పాత్రల్లో వండొద్దనీ, ప్లాస్టిక్‌ బౌల్స్‌లో వేడివేడి ఆహారం వడ్డించకూడదనీ నిపుణులు చెబుతున్నారు. వీటిలోని రసాయనాలు తీవ్ర అనారోగ్యాలకు దారి తీస్తాయని హెచ్చరిస్తుండటంతో చెక్క, వెదురుతో తయారయ్యే ప్లేట్లు, బౌల్స్‌ వినియోగం పెరిగింది. ఇందులో చిన్నారులకు ప్రత్యేకమైనవీ వచ్చేశాయి.

రెండేళ్లు నిండేటప్పటికి... పిల్లలు  తమంతట తాము ఆహారం తీసుకుని తినే అలవాటు చేయాలి. ఇందుకోసం వారి కంటిని ఆకర్షించేలా పదార్థాలను తయారుచేసి అందించాలి. చిన్నారులు ఇష్టంగా తినేలా చేయడానికి ఉడికించిన గుడ్డు, ఆమ్లెట్, అన్నం, పండ్లు.. వంటివాటిని ఆకట్టుకునేలా ప్లేట్లలో సర్దాలి. అందుకోసమే ప్రత్యేకంగా పర్యావరణ హిత కట్లరీ బుజ్జాయిలకోసం దొరుకుతోంది. సీతాకోకచిలుక, ఏనుగు, కుందేలు వంటి ఎన్నో ఆకృతుల్లోనూ దొరికే ఈ వెదురు పాత్రలు పిల్లల్ని భలేగా మెప్పిస్తాయి.

బౌల్స్‌ వస్తున్నాయి...

పండ్ల సలాడ్, పెరుగన్నం వంటివి చిన్నారులకు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం. వాటిని ఒలకపోసుకోకుండా, చేతిలో ఇమిడేలా సిలికాన్‌ కోస్టర్‌ ఏర్పాటుతో కొత్తరకం బౌల్స్‌ వస్తున్నాయి. వీటికి జతగా మ్యాచింగ్‌ చెంచాలూ ఉండటంతో పిల్లలూ వీటిల్లో తినడానికి సరదా పడతారు. నచ్చినవి ఇందులో వేసుకుని ఎంచక్కా లాగించేస్తారు.  

సరదాగా కట్‌ చేయొచ్చు...

నాలుగైదేళ్ల పిల్లలు అమ్మతోపాటు తాము కూడా కూరగాయలు, పండ్లు కట్‌ చేస్తామని మారాం చేస్తుంటారు. వారి సరదా కాదనకుండా, అలాగని వారి చిట్టి చేతులకు ఎటువంటి గాయాలూ కాకుండా ఉండేలా చెక్క కత్తి, కట్టర్‌ వంటివి మార్కెట్‌లోకి వచ్చాయి. పదునుగా లేకుండా మృదువుగా పండ్లను కట్‌చేయగలిగే వీటిని పిల్లలకు ధైర్యంగా అందించొచ్చు. కీరదోస, అరటి పండు వంటి వాటిని తేలిగ్గా చిన్నారులు కోయగలరు. వాళ్లకీ సరదా తీరుతుంది. గాయాలవుతాయనే భయం పెద్దవాళ్లకూ ఉండదు. పిల్లలకోసం వచ్చిన ఈ సామాన్లన్నీ భలేగున్నాయి కదూ... మరింకెందుకాలస్యం.. మీ బుజ్జాయిలకూ వీటిని కొనేయండి. వాళ్ల ఆరోగ్యాన్ని పరిరక్షించండి.   

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్