Updated : 04/11/2022 05:20 IST

కటిక చీకట్లో కంటి బాధతో...

అనుభవ పాఠాలు

కోబ్రా కమాండో విభాగంలో తొలి మహిళా కమాండెంట్‌గా మొదటిసారి ఓ రాత్రిపూట  నక్సల్స్‌ ప్రాంతంలో అడవిలోకి వెళ్లాల్సి వచ్చింది. నడుస్తుంటే ఏదో వచ్చి నా కంటిలో గుచ్చుకుంది. చుట్టూ కటిక చీకటి. భరించ లేని బాధ. చిన్న శబ్దం కూడా చేయకూడదు. ఎందుకంటే ఎక్కడ ఎవరున్నారో తెలియదు. వెనక్కి వెళ్లాలన్నా ప్రమాదమే. ఆ నొప్పితోనే పని చేశా. తెల్లారాక చూస్తే నా కంట్లో ఏదో చెక్క ముక్క గుచ్చుకుంది. అడవి నుంచి బయటకొచ్చి వైద్యుల్ని కలిసే వరకు నా బాధ వర్ణనాతీతం. అయినా ఈ యూనిఫాం వేసుకున్నప్పుడే ఏ కష్టానికైనా సిద్ధపడ్డా. మా తాతయ్య, నాన్న సీఆర్‌పీఎఫ్‌లో విధులు నిర్వహించారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవానికి నన్ను నాన్న దిల్లీ తీసుకెళ్లేవారు. ఆ వేడుకల్లో సైనికుల దుస్తులు నన్ను ఆకర్షించేవి. చదువుతూనే క్రీడల్లో అడుగుపెట్టా. దిల్లీ తరఫున ట్రిపుల్‌ జంప్‌ ఆడేటప్పుడు జాతీయ స్థాయిలో గెలవాలనేది లక్ష్యం. కోబ్రా కమాండోగా బాధ్యతలు తీసుకున్నాక మగవాళ్లతో పాటు కలిసి ప్రమాదకర ప్రాంతాల్లో పని చేస్తానని కోరి మరీ వచ్చా. మీరే స్ఫూర్తి అని ఎవరైనా అమ్మాయిలు చెబుతుంటే గర్వంగా ఉంటుంది. యూనిఫాం వేసుకుంటేనే శక్తిమంతులం అనుకోవద్దు. లక్ష్య సాధనకు కృషి చేసే ప్రతి మహిళా శక్తిమంతురాలే. ధైర్య సాహసాలుండి, ఈ రంగంలోకి రావాలనుకుంటే వెనకడుగు వేయొద్దు. నృత్యం, నటన.. ఏ రంగంలోనైనా సరే.. అడుగుపెట్టాలనుకుంటే ఆలోచించకుండా ప్రయత్నించండి. ఫలానా రంగమే మహిళలకు సరైనది అంటూ ఏదీ లేదు. ధైర్యంగా అడుగేసి కృషి చేస్తే చాలు. మీరే విజేతలవుతారు.

- ఉషాకిరణ్‌, సీఆర్‌పీఎఫ్‌ అధికారి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి