Published : 05/11/2022 00:12 IST

ఈ పరిస్థితి ఎందరిదో!

అనుభవ పాఠాలు

ఫ్రెండ్‌, టీచర్‌, కోచ్‌, చీర్‌లీడర్‌.. పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎదిగేవరకు ఇలా ఎన్నో పాత్రలు పోషించా. వాళ్ల చిన్నతనంలో స్కూలు, ఆర్ట్‌ క్లాస్‌, స్నేహితుల ఇంటికి తిప్పేదాన్ని. వాళ్లు యుక్త వయసుకి వచ్చారు. హమ్మయ్య పెరిగిపోయారు.. అనుక్షణం కనిపెట్టుకోవాల్సిన పనుండదు అనిపిస్తోంది కదా! నిజమే కానీ.. ఇప్పుడు ఈతరం ఆలోచనల్ని అర్థం చేసుకోగలనా? వాళ్ల సమస్యల్ని తీర్చగలనా? వాళ్లని ఆనందంగా ఉంచడమెలా? వాళ్ల అపజయాలను భరించేంత దృఢంగా అయ్యానా.. మళ్లీ బోలెడు కొత్త ప్రశ్నలు. అమ్మని కదా.. చాదస్తంలా తోచినా ఆ గాభరా కొనసాగుతూనే ఉంటుంది. గత రెండు దశాబ్దాలుగా సంస్థ అధినేత్రిగా, అమ్మగా బాగా సమన్వయం చేసుకొచ్చా అనుకుంటున్నారా? ఈ క్రమంలో మాటిచ్చీ చేయలేకపోయినవీ, చేయాలనుకొని విఫలైమనవీ ఎన్నో. అయితే ఏ దశలోనూ కుంగిపోలేదు. నా పరిస్థితి వివరిస్తూనే.. మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ వచ్చా. కెరియర్‌, కుటుంబం మధ్య సమన్వయం కోసం శ్రమించే వారెందరో. ఆ ప్రయత్నంలో కలిగే ఒత్తిడీ ఎంతో. కానీ బాధపడొద్దు, కుంగిపోవద్దు. మీ ఇబ్బందిని నోరు తెరచి చెప్పండి. అర్థం చేసుకోలేరని మీరే నిర్ణయించుకోవద్దు. చెప్పడం వరకూ మీ బాధ్యత. అన్నట్టూ ఈ పరిస్థితి నాలా, మీలా మరెందరిదో కూడా! వాళ్లను గమనిస్తూ ఉండండి. ముందుకు సాగే చిట్కాలూ దొరుకుతాయి. గర్వంగా మున్ముందుకు నడవండి.. మిమ్మల్ని ఇంకొకరు అనుసరిస్తారు.

- రేవతి అద్వైతి, సీఈఓ, ఫ్లెక్స్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి