Updated : 18/12/2022 09:35 IST

వాటికి చోటివ్వం

అనుభవపాఠం

కెరియర్‌ అన్నాక ఎత్తుపల్లాలు సహజం. నేను, విరాట్‌.. ఎన్నో జయాపజయాలను చూశాం. కానీ పెళ్లయ్యాక తన ప్రతి వైఫల్యాన్నీ నా మీదే తోసే వారు. నిజానికి జంట మధ్య విభేదాలకు ఈ కారణం చాలు. అయితే ఇవి మా మధ్య ఏమాత్రం పొరపొచ్చాలు తేలేకపోయాయి. కారణం.. ఇద్దరి సమన్వయ కృషే! మూడు సూత్రాలకు మా బంధంలో విలువనిచ్చాం. ఒకరిపై మరొకరు విశ్వాసం ఉంచడం, ఎలాంటి పరిస్థితిలోనైనా ఒకరికి ఒకరం తోడుగా నిలవడం, వ్యక్తిగత స్వేచ్ఛ ఇచ్చిపుచ్చుకోవడం..

ఆ పరిధులను దాటకపోవడం.. ఇవి మా బంధాన్ని దృఢంగా చేశాయి. పనిరీత్యా ఇద్దరం కొద్దిరోజులపాటు దూరంగా ఉండటం తప్పనిసరి. దాన్ని మా మనసుల్లోకి రానివ్వకుండా చూసుకుంటాం. ఏమాత్రం ఖాళీ దొరికినా ఒకరికొకరం సమయం కేటాయించుకుంటాం. కెరియర్లకు ఇద్దరమూ ప్రాధాన్యమిస్తాం. అలాగని అదే లోకంగా బతకం.
ఆ తలనొప్పులను ఇంటికి తీసుకురాం. ఒకసారి ఇంట్లోకి అడుగుపెట్టామంటే ‘స్టార్‌’ హోదా పక్కన పెట్టేస్తాం. మామూలు భార్యాభర్తలం అయిపోతాం. ఇక బయటివాళ్లు ఏమనుకుంటే ఏమిటి? ఒకరికొకరు తోడుగా ఉంటూ.. పనికీ, వ్యక్తిగత జీవితానికీ పరిధులు విధించుకుంటే.. ఆ బంధం ఎలాంటి పరీక్షలైనా తట్టుకోగలదు, దృఢంగా మారగలదు. 

  - అనుష్క శర్మ, నటి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి