వాళ్లే.. సూపర్‌ విమెన్‌!

ఆడవాళ్లు అనగానే భార్యగా, తల్లిగా, ఉద్యోగినిగా.. అన్ని బాధ్యతల్నీ ఒంటిచేత్తో సమన్వయం చేయాలని చెబుతుంటారు. అటువంటి వాళ్లనే సూపర్‌ విమెన్‌గా చూపిస్తుంటారు.

Published : 08 Mar 2023 00:35 IST

డవాళ్లు అనగానే భార్యగా, తల్లిగా, ఉద్యోగినిగా.. అన్ని బాధ్యతల్నీ ఒంటిచేత్తో సమన్వయం చేయాలని చెబుతుంటారు. అటువంటి వాళ్లనే సూపర్‌ విమెన్‌గా చూపిస్తుంటారు. అందుకే ఆ స్థాయికి చేరుకోవాలని కష్టపడుతుంటాం. ఒత్తిడికీ గురవుతుంటాం. కొందరు ఆఫీసులో బాగా పనిచేయగలరు. ఇంట్లో తడబడుతుండొచ్చు. ఇంకొందరు వృత్తిలో వెనకబడొచ్చు. అంటే వాళ్లు విఫలమైనట్టేనా? చేసే ప్రతి పనినీ ఆస్వాదించాలి, స్వీయ ఆరోగ్యం, లక్ష్యాలపై దృష్టిపెట్టాలి, వాటిని సాధించడానికి ప్రయత్నించాలి. ఎవరూ పరిపూర్ణులు కాదు. నేనూ అంతే అనుకుంటూ ముందుకు సాగగలగాలి. నా దృష్టిలో వాళ్లే సూపర్‌ విమెన్‌!

- మెహక్‌ సాగర్‌, సహ వ్యవస్థాపకురాలు, వెడ్‌మీగుడ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్