‘కళ’కు భరోసానిస్తూ..

చాలామందికి కళలంటే ఆసక్తి ఉంటుంది. కానీ తమను తాము నిరూపించుకోడానికే సరైన వేదిక లేక ఆగిపోతుంటారు. అలాంటి సమస్యే ఆమెకూ వచ్చింది. దానికో పరిష్కారమూ కనిపెట్టింది.. పుణెకి చెందిన సుహాని దడ్‌ఫలే.

Published : 09 Apr 2023 01:14 IST

చాలామందికి కళలంటే ఆసక్తి ఉంటుంది. కానీ తమను తాము నిరూపించుకోడానికే సరైన వేదిక లేక ఆగిపోతుంటారు. అలాంటి సమస్యే ఆమెకూ వచ్చింది. దానికో పరిష్కారమూ కనిపెట్టింది.. పుణెకి చెందిన సుహాని దడ్‌ఫలే.

పుణెలో బీఎస్సీ ఎకనమిక్స్‌ చదువుతున్న సుహానీకి చిన్నప్పటి నుంచి కవిత్వమన్నా, కళలన్నా ఎంతో ఇష్టం. లాక్‌డౌన్‌ సమయంలో, తనను తాను బిజీగా ఉంచుకోవాలనుకుని నైపుణ్యాలకు పదునుపెట్టింది. అప్పుడే కళా కారులు తమ ఆలోచనలను, పంచు కోవడానికి ఎటువంటి ప్లాట్‌ఫామ్‌ లేదని తెలుసుకున్న ఈమె 2020లో ‘సంఘం ఇండియా’ అనే పేరుతో ఇన్‌స్టా పేజీ మొదలు పెట్టింది. అందులో కళలకు సంబంధించిన వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి పోస్ట్‌ చేసేది. మొదట సుహానీనే ఈ పేజిని నడిపినా కొన్ని నెలల తరువాత మరో ముగ్గురిని నియ మించుకుంది. ఇందులో మొత్తం 32మంది ఉద్యోగులున్నారు. వారి వయసు 14నుంచి24 ఏళ్లు మాత్రమే. మొత్తం 600 మంది భారతీయ కళాకారులు ఉన్నారు. ఓపెన్‌ మైక్‌ నైట్స్‌, మ్యూజిక్‌ ఫెస్టివల్స్‌ వంటివీ చేస్తున్నారు. జూమ్‌, గూగుల్‌ మీట్‌, ఇన్‌స్టా లైవ్‌ వంటివి ఎక్కువగా వీరు వినియోగించే డిజిటల్‌ ఈవెంట్‌ ప్లాట్‌ఫామ్‌లు. అప్పుడు చాలామంది వాళ్ల టాలెంట్‌ను చూపించడానికి ముందుకొచ్చారు. ఇన్‌స్టాలో ఇప్పటికి 3వేల ఫాలోయర్లు ఉన్న సుహానీకి వీక్షణలు 20నుంచి 40వేల దాకా ఉంటాయి. ‘సంఘం ఇండియా’ ద్వారా ఈమె కళాకారులకు ఆర్థిక భరోసా ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో వారికి ఉపయోగపడే నైపుణ్యాల్లో ఉచిత శిక్షణ కల్పిస్తోంది.

చదువుకోక ఇవన్నీ ఎందుకన్నారు..

‘మొదట్లో చాలా మంది చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని, చిన్న వయసులో ఇవన్నీ అవసరమా అని నన్ను నిరుత్సాహపరిచారు. కానీ నేను అనుకున్నది సాధించవాలనుకున్నా. నాన్న ఇచ్చిన ఫండ్‌తో డిసెంబర్‌ 2020లో కరోనా ఉద్ధృతమైన సమయంలో మేము మా మొదటి ఆన్‌లైన్‌ కార్యక్రమం నిర్వహించుకున్నాం. చాలా మంది కళాకారులు, మాతో పనిచేయడానికి కుతూహలం చూపించేవారు. దేశంలో పుణె, ముంబయి వంటి ప్రాంతాల్లో ఆఫ్‌లైన్‌ ఈవెంట్లనీ ప్రారంభించాం. కానీ కంపెనీని విస్తరించడం అంత తేలికైన పని కాదు. ఈ సంస్థను నడిపించడమే కాకుండా కళాకారులు సాధికారత సాధించడమే నా ఆశయం’ అంటోంది సుహానీ. వివిధ కీలక సమస్యలపై పనిచేస్తున్న అశోకా యంగ్‌ ఛేంజ్‌ మేకర్స్‌ బృందంలో ఈమె కూడా ఒకరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్