నెలసరి వేళ.. రితుమతి!

దేశంలో నవరాత్రి ఉత్సవాలు అనగానే గుర్తొచ్చేది కోల్‌కతా. అక్కడ ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పోటీపడి మరీ మండపాలను తీర్చిదిద్దుతారు. ఈసారి అక్కడ తీర్చిదిద్దిన ఓ మండపం చాలామందిని ఆకర్షించడమే కాదు.. నెటిజన్ల ప్రశంసలనూ అందుకుంటోంది. ప్రత్యేకత ఏంటంటే..

Updated : 18 Oct 2023 12:34 IST

దేశంలో నవరాత్రి ఉత్సవాలు అనగానే గుర్తొచ్చేది కోల్‌కతా. అక్కడ ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పోటీపడి మరీ మండపాలను తీర్చిదిద్దుతారు. ఈసారి అక్కడ తీర్చిదిద్దిన ఓ మండపం చాలామందిని ఆకర్షించడమే కాదు.. నెటిజన్ల ప్రశంసలనూ అందుకుంటోంది. ప్రత్యేకత ఏంటంటే..

‘ష్‌.. పెద్దగా మాట్లాడకు’, ‘అరెరె.. వాటిని ముట్టుకోకు’ నెలసరి సమయంలో అమ్మాయిలకు వినిపించే మాటలే ఇవి. అందరూ ఇలా దాన్నో రహస్యంగా దాస్తూ వెళితే ఎలా? ఇదే ప్రశ్నిస్తున్నారు ఎల్లోరా సాహా. దానికి ఆమె చేసుకున్న వేదిక అమ్మవారి మండపం. పూజలు, పండగల వేళ నెలసరి గురించి మాట్లాడటమే తప్పుగా భావిస్తారు కదా అంటే ఆమె మాత్రం ‘ఆడవాళ్లు చంద్రయాన్‌ 3 వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లోనూ భాగస్వాములు అవుతున్నారు. కానీ ఇప్పటికీ నెలసరి వేళ వంటింట్లోకీ రాకుండా.. శుభ్రతలేని ప్రదేశాల్లో గడిపేస్తున్నారు. నిజానికి ఒక జీవికి ప్రాణం పోసే శక్తికి చిహ్నమది. ఆ సమయంలో ఆమె శరీరం, మనసు రెండూ సున్నితంగా మారతాయి. దాన్ని పట్టించుకోకుండా అంతా ఆంక్షలు విధిస్తుంటారు. ఈక్రమంలో అమ్మాయిలు, ఆడవాళ్లు ఎన్నో అనారోగ్య సమస్యలు, ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతున్నారు. అందుకే అవగాహన కల్పిస్తూనే ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మగ, ఆడ తేడా తెలియకుండా అందరికీ తెలియజెప్పాలన్నదే మా ప్రయత్నం’ అంటారు ఎల్లోరా. పతురియఘాటా పాంచర్‌ పల్లి సర్వోజనిన్‌ దుర్గోత్సవ్‌ అనే కమిటీకి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆమె. ఏడాదికో థీమ్‌ను రూపొందించే వీళ్లు ఈ సారి ‘నెలసరి శుభ్రత’ను ఎంచుకున్నారు. పెయింటింగ్స్‌, మోడల్స్‌, గ్రాఫిక్‌ రూపంలో తయారు చేసిన ఈ థీమ్‌కు ‘రితుమతి’ అని పేరుపెట్టారు. దీని రూపకల్పనకు మూడు నెలలు, రూ.18లక్షలు అయ్యాయట. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో ఉంచగా వైరల్‌ అవ్వడమే కాదు.. ఎంతోమంది నుంచి సానుకూల స్పందననూ అందుకుంటోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్