అక్కడ ఎలా పెరుగుతారంటే...!

పిల్లలే రేపటి పౌరులు. వారు ఆరోగ్యంగా ఉండాలన్నా, క్రమశిక్షణ, బాధ్యత కలిగిన వ్యక్తులుగా మెలగాలన్నా వారి పెంపకం బాగుండాలి. ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది అదే కదా! అయితే, ఒక్కోదేశంలో ఒక్కో రకంగా పిల్లల్ని పెంచుతుంటారు.

Published : 30 Jan 2023 00:02 IST

పిల్లలే రేపటి పౌరులు. వారు ఆరోగ్యంగా ఉండాలన్నా, క్రమశిక్షణ, బాధ్యత కలిగిన వ్యక్తులుగా మెలగాలన్నా వారి పెంపకం బాగుండాలి. ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది అదే కదా! అయితే, ఒక్కోదేశంలో ఒక్కో రకంగా పిల్లల్ని పెంచుతుంటారు. కొన్నింటి గురించి మనమూ తెలుసుకుందామా!

* వియత్నాంలో తల్లిదండ్రులు పిల్లలకు తొమ్మిది నెలలు వచ్చే సరికి డైపర్లు వేయడం మానేస్తారు. వారికి కాలకృత్యాల అవసరమొస్తే చాలు చిన్నగా ఈల వేయడం నేర్పిస్తారట.

* నార్వే, స్వీడన్‌, ఫిన్‌లాండ్‌ దేశాల్లో గడ్డకట్టే చలిలోనూ పసిపిల్లలను సైతం కాసేపు బయట తిప్పుతారు. ఇలా చేస్తే వారు స్వచ్ఛమైన గాలి పీల్చుకోగలుగుతారనీ, జలుబు బారిన పడకుండా ఉంటారని వారి నమ్మకం.

* మనం సాధారణంగా పిల్లలకు ఆకలేస్తుందేమోనని ఆలోచిస్తూ తరచూ ఏదో ఒకటి పెడుతూ ఉంటాం. కానీ, ఫ్రాన్స్‌, దక్షిణ కొరియాలో ఎంత చిన్నపిల్లలైనా సరే వారా పని చేయరు. పెద్దవాళ్లు ఎప్పుడు తింటే అప్పుడే వాళ్లతో కలిసి భోజనం చేయాలి. అది వాళ్లలో క్రమశిక్షణ పెంచుతుందని వారి నమ్మకం. అంతేకాదు, చిన్నారులు తినడంలో ఎంచుకోవడం కంటే అన్నీ తినగలిగే అలవాటు చేసుకుంటారని వారు భావిస్తారు.

* మనలాగే జపాన్‌లో కూడా చిన్నపిల్లలను పక్కన పడుకోబెట్టుకోవడం సాధారణం. దానివల్ల వారిలో ధైర్యం పెరిగి స్వతంత్రంగా ఉండగలరని భావిస్తారు. అయితే అమెరికాలో ఇలా చేయడం వల్ల పిల్లలు ప్రతి దానికీ ఇతరులపై ఆధారపడతారని నమ్ముతారు. అలానే జపాన్‌లో చిన్నారులు స్వతంత్రంగా ప్రజా రవాణా వ్యవస్థల్ని ఉపయోగిస్తారు. దాన్ని పెద్దలు చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తారు.

* స్వీడన్‌లో పెద్దవారితో పాటూ కుటుంబానికి సంబంధించిన అన్ని నిర్ణయాల్లో పిల్లల అభిప్రాయం తీసుకుంటారు. దీనివల్ల సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం చిన్నప్పటి నుంచే అలవాటవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్