పిల్లల్ని ఎలా పెంచుతున్నారు?

పిల్లల పెంపకమూ ఒక కళే! సంతోషకరమైన బాల్యం బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. క్రమశిక్షణ తోడైతే జీవితంలో ఉన్నత స్థానాల్లో నిలబెడుతుంది. అయితే మాంటిస్సోరీ విధానాన్నీ ప్రయత్నించేయమంటున్నారు నిపుణులు. పిల్లలను కొత్త విషయాలను అన్వేషిస్తూ నేర్చుకునేలా ప్రోత్సహించడమే ఈ పద్ధతి ప్రత్యేకత.

Updated : 04 Feb 2023 05:40 IST

పిల్లల పెంపకమూ ఒక కళే! సంతోషకరమైన బాల్యం బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. క్రమశిక్షణ తోడైతే జీవితంలో ఉన్నత స్థానాల్లో నిలబెడుతుంది. అయితే మాంటిస్సోరీ విధానాన్నీ ప్రయత్నించేయమంటున్నారు నిపుణులు. పిల్లలను కొత్త విషయాలను అన్వేషిస్తూ నేర్చుకునేలా ప్రోత్సహించడమే ఈ పద్ధతి ప్రత్యేకత. ఇంతకీ ఇదేంటో తెలుసుకుందాం రండి.

తప్పులు చేయనివ్వాలి....

పిల్లలన్నాక తప్పులు చేయడం సహజమే! నేర్చుకునేప్పుడు ఇంకా ఎక్కువగా దొర్లుతాయి. అంతమాత్రాన వాళ్లను శిక్షించొద్దు. తప్పులు చేయటానికి, తద్వారా నేర్చుకోవడానికి వారికి అవకాశమివ్వాలి. పిల్లలు ఎవరికి వారే ప్రత్యేకం. వాళ్ల ఎదుగుదలలో అవసరమైన సాయం అందించడమే మన బాధ్యత.

మనమూ గౌరవించాలి...

‘పిల్లలు.. వాళ్లకి గౌరవమేంటి’ అనుకోవద్దు. వాళ్లనీ గౌరవించాలి. ఉదాహరణకు వాళ్లకి సంబంధించిన కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటే కోప్పడొద్దు. చేయనివ్వండి. ఇక్కడ మనం అనుసరించాల్సిందల్లా ఇతరులకు ఇబ్బంది కలగనివ్వక పోతే చాలన్న సూత్రమే. కాబట్టి, కనీసం చిన్న చిన్న అంశాల్లోనైనా ఆ సౌలభ్యాన్ని వాళ్లకి ఇవ్వండి.

తల్లిదండ్రులే ఆదర్శం..

బాల్యంలో పిల్లల మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆ సమయంలో వాళ్లు ఎదుర్కొన్న పరిస్థితులు, అనుభవాలు వారి వ్యక్తిత్వ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయి. పిల్లలు నేర్చుకునేదేమో మనల్ని.. అంటే తల్లిదండ్రులను చూసే. కాబట్టి వాళ్ల ఎదుట మీ ప్రవర్తన ఎలా ఉందో గమనించుకుంటూ ఉండాలి.

తర్కంతో కూడిన క్రమశిక్షణ...

పిల్లలు తప్పుచేసినప్పుడు దండించేస్తాం. బదులుగా సమస్య పరిష్కార మార్గాలు అన్వేషించేలా ప్రోత్సహించండి. స్వేచ్ఛగా ఆలోచించినప్పుడే తప్పొప్పులు గ్రహించగలుగుతారు. గుడ్డిగా ఎవరినీ అనుసరించరు.

భావోద్వేగాల్లో...

పిల్లల మనసు మరీ సుకుమారం. పరిస్థితులకు వెంటనే ప్రతిస్పందిస్తారు. అలాంటి సమయాల్లోనే మనం వారికి స్థితప్రజ్ఞతను అలవరచుకునేలా చేయాలి. భావోద్వేగాలు నియంత్రించుకునే నైపుణ్యాలు పెంపొందించాలి. అందుకు అవసరమైన సానుకూల వాతావరణాన్ని మనమే కల్పించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్