మా బావే నా పెళ్లి చెడగొట్టాడు!

మేము ముగ్గురం అమ్మాయిలం. మా అక్కలిద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. నాకు సంబంధాలు చూస్తున్నారు. ఒక సంబంధం ఎంగేజ్‌మెంట్‌ వరకు వచ్చి ఆగిపోయింది. వాళ్లకు మా చిన్న బావే చెడుగా చెప్పాడని తెలిసింది.

Updated : 01 Dec 2023 13:55 IST

మేము ముగ్గురం అమ్మాయిలం. మా అక్కలిద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. నాకు సంబంధాలు చూస్తున్నారు. ఒక సంబంధం ఎంగేజ్‌మెంట్‌ వరకు వచ్చి ఆగిపోయింది. వాళ్లకు మా చిన్న బావే చెడుగా చెప్పాడని తెలిసింది. పెళ్లై మూడేళ్లవుతున్నా ఇప్పటికీ అతను అక్కను వేధిస్తున్నాడు. ఇప్పుడు ఇలాంటి పని చేయడం వల్ల చాలా బాధగా ఉంది. ఈ విషయం గురించి అతనినే నేరుగా అడిగేద్దామనుకుంటే మా అక్క వద్దంది. తనను హింసిస్తాడని, అతన్ని ఏమీ అనొద్దని మమ్మల్ని బతిమాలుతోంది. అతనికి ఎలా బుద్ధి చెప్పాలో తెలియడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీ అక్కను అతను మూడేళ్లుగా వేధిస్తున్నాడని చెబుతున్నారు. కాబట్టి, ముందు మీరు మీ అక్క సమస్యకు పరిష్కారం వెతికే ప్రయత్నం చేయడం మంచిది. ఇందుకోసం తనలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయండి. మూడేళ్లుగా అతను మీ అక్కను వేధిస్తున్నా మీ కుటుంబ సభ్యులెవరూ జోక్యం చేసుకోక పోవడంతో అతను అలుసుగా తీసుకున్నాడనిపిస్తోంది. మీ అక్కకు అతడి వల్ల ఏదైనా హాని జరిగితే ఒక కుటుంబంగా తనకు మీరున్నారనే భరోసా ఇవ్వడం ముఖ్యం. వేధింపుల గురించి ఇరువైపులా పెద్దవాళ్లతో కూర్చొని పరిష్కరించుకోవచ్చేమో ఆలోచించండి. ఈ క్రమంలో అతనికి ఈ విషయంపై సున్నితంగా హెచ్చరిక చేయండి. ఇలా చేయడం వల్ల అతను తన ప్రవర్తన మార్చుకొని మీ అక్కతో సఖ్యతగా ఉండే అవకాశాలు లేకపోలేదు. అలాగే భవిష్యత్తులో మీ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి కూడా అతను ధైర్యం చేయకపోవచ్చు. తద్వారా మీకొచ్చే సంబంధాలు అతడి వల్ల చెడిపోయే అవకాశాలు తగ్గుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్