Teenage: కౌమారదశలో ఇవి నేర్పుతున్నారా..

యుక్తవయసులోకి అడుగుపెడుతున్న పిల్లలకు పరిశుభ్రతపై అవగాహన కలిగించాలంటున్నారు నిపుణులు. లేదంటే పలురకాల అనారోగ్యాలబారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Updated : 29 Mar 2023 05:22 IST

యుక్తవయసులోకి అడుగుపెడుతున్న పిల్లలకు పరిశుభ్రతపై అవగాహన కలిగించాలంటున్నారు నిపుణులు. లేదంటే పలురకాల అనారోగ్యాలబారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

దయం ఆలస్యంగా లేవడం.. ఆపై సమయం మించిపోతోందని త్వరగా బ్రష్‌ ముగించడం. రాత్రేమో భోజనం తర్వాత అలసిపోయాక నోరు శుభ్రం చేసుకోకుండానే పక్కమీదకి చేరడం.. ఇలాంటివి పిల్లలు చేస్తోంటే ముందే వారించండి. భవిష్యత్తులో నోటికి సంబంధించిన అనారోగ్యాలకు దారితీస్తాయని అవగాహన కలిగించాలి. కచ్చితంగా రోజూ రెండు సార్లు బ్రష్‌ చేసేలా చూడండి.

అలవాట్లు..

స్నానం సరిగ్గా చేయకపోతే కలిగే నష్టాలు చెప్పి, చర్మారోగ్యంపై అవగాహన కలిగించాలి. బాగా ఆడి చెమట, దుమ్ముతో అలాగే పడుకుంటే మొటిమలు, మచ్చలొస్తాయని చెప్పండి. నిద్రపోయే ముందు ముఖాన్ని తప్పక శుభ్రపరచుకోమనండి. పాఠశాల నుంచి రాగానే స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించడం అలవాటు చేయాలి. లోదుస్తులు మార్చకపోవడం, బిగుతైన దుస్తులతో నిద్రపోవడం మంచిదికాదని తెలియజేయాలి. 

నెలసరిలో..

నెలసరి మొదలైనప్పుడు అవగాహన తక్కువగా ఉంటుంది. అయోమయానికి గురవుతుంటారు. ఇటువంటప్పుడు పరిశుభ్రతతోపాటు ప్యాడ్‌ మార్పిడి సమయాన్ని చెప్పాలి. దాని ఎంపికలోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలి. జననాంగాల పరిశుభ్రత అవసరాన్ని తెలియజేయాలి. నెలసరి సమయంలో హార్మోన్లలో మార్పులొస్తాయి. వాటిపై అవగాహనతోపాటు ఆ సమయంలో మొటిమలు, మచ్చలు సాధారణం, కంగారు పడొద్దని భరోసానివ్వండి. దూరం చేసుకోవడంలో సాయమూ చేయండి. ముఖం, పెదాలపై గోళ్లతో నిత్యం గిల్లుతుంటారు. అలా చేయకుండానూ చూసుకోవాలి.

వ్యాయామంతో..

నిత్యం చేసే వ్యాయామం, నడక, నృత్యం, క్రీడలు వంటివి ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షిస్తాయో చెప్పాలి. పెద్దవాళ్లు ఈ నియమాన్ని పాటిస్తే పిల్లలూ అనుసరిస్తారు. వాళ్లకూ ఆసక్తి ఉంటుంది. వ్యాయామం భౌతికంగానేకాదు, మానసిక ఉల్లాసాన్నీ కలిగిస్తుంది. నిద్ర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలతోపాటు రోజుకి ఏడెనిమిది గంటల నిద్ర ముఖారవిందాన్ని మరింత తాజాగా మార్చగలదో చెప్పాలి. ఇవేకాకుండా  అలర్జీలు రాని పౌడర్‌, సెంటు ఎంచుకోవడం నేర్పాలి. వీటిని వినియోగించడంలో అవగాహనివ్వాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్